ఆంధ్రప్రదేశ్‌

దళితులకు తనఖా లేకుండా బ్యాంకు రుణాలివ్వాలి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 26: ఎస్సీలకు ఎటువంటి తనఖా అవసరం లేకుండా బ్యాంకు రుణాలివ్వడానికి ఉన్నతస్థాయిలో చర్యలు తీసుకోవాలని జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు కె రాములు డిమాండ్‌చేశారు. ఎస్సీలకు రూ.10 లక్షల నుంచి రూ.కోటి వరకు రుణాలు అందివ్వాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందన్నారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరం సమీపంలోని గరగపర్రు గ్రామంలో వెలికి గురైన బాధిత కుటుంబాలను సోమవారం రాములు పరామర్శించారు. ఈ సందర్భంగా బాధితులు తమకు జరిగిన అన్యాయాన్ని ఆయనకు వివరించారు. తాము కౌలు చేసే భూములను లాక్కున్నారని, గ్రామ బహిష్కరణ చేశారని తెలిపారు. దీనిపై స్పందించిన ఆయన జిల్లా కలెక్టర్ కాటంనేని భాస్కర్ సమక్షంలో వెంటనే ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేసిన ఇందుకూరి బలరామరాజును అరెస్టుచెయ్యాలని జిల్లా ఎస్పీ రవిప్రకాష్‌ను ఆదేశించారు. బాధితులకు రక్షణ కల్పిస్తామని భరోసా ఇచ్చారు. అనంతరం ఆయన విలేఖర్లతో మాట్లాడుతూ జాతీయ ఎస్సీ కమిషన్ గ్రామాలు, పట్టణాల్లో జరుగుతున్న భూతగాదాలపై ప్రత్యేక దృష్టి సారించిందన్నారు. ఎస్సీలకు పంపిణీచేసిన భూములను ప్రభుత్వం తిరిగి తీసుకోవడంవల్ల దళితుల ఆర్ధిక పరిస్ధితి దెబ్బతినడమేకాక, ఆత్మగౌరవం చంపుకుని జీవించాల్సి వస్తోందన్నారు. గుంటూరు, ప్రకాశం, విజయవాడ తదితర జిల్లాల్లో అప్పట్లో కలెక్టర్ చంద్రయ్య సాగు చేసుకునేందుకు ఇస్తే ఇప్పుడు ప్రభుత్వం వాటిని లాక్కుంటుందన్నారు. అదేవిధంగా భూతగాదాల్లో దళితులను దోషులుగా చేస్తున్నారని ఆగ్రహం వ్యక్తంచేశారు. ఎస్సీలు పోలీసు స్టేషన్లకు వెళ్తే వారి ఫిర్యాదులను పక్కనపెట్టి మరో వర్గానికి మేలుచేస్తున్నారన్నారు. బిజెపి ఎస్సీ మోర్చ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పివి.రాఘవులు, జిల్లా కన్వీనర్ బూసి సురేంద్రనాథ్ బెనర్జీ, సుప్రీం కోర్టు న్యాయవాదులు ఎం.కళ్యాణ్‌రావు, విక్రమ్ కిషోర్ ఉన్నారు.

చిత్రం.. దళితుల సమస్యలు తెలుసుకుంటున్న జాతీయ ఎస్సీ కమిషన్ సభ్యుడు రాములు