ఆంధ్రప్రదేశ్‌

విద్యుత్ చార్జీలు తగ్గిస్తాం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: భవిష్యత్తులో విద్యుత్ చార్జీలను పెంచబోమని, తగ్గిస్తాం తప్ప పెంచే ప్రసక్తి ఉండదని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు పునరుద్ఘాటించారు. విజయవాడలో ఇంటర్నేషనల్ ఎంఎస్‌ఎంఇ డే సందర్భంగా మంగళవారం జరిగిన వర్కుషాపులో సిఎం మాట్లాడుతూ విద్యుత్ చార్జీల తగ్గించేందుకు అవసరమైన కార్యాచరణ ప్రణాళిక తయారు చేస్తున్నట్లు చెప్పారు. సౌరశక్తిని నిలువ చేసే సౌకర్యం అందుబాటులోకి వస్తే, తక్కువ ధరకే సరఫరా చేయవచ్చన్నారు. రానున్న కాలంలో అనేక మార్పులు చోటు చేసుకోనున్నాయన్నారు. కష్టాల్లో ఉన్న సమయంలో తనను సాంకేతికత కాపాడిందని గుర్తు చేసుకున్నారు. ఆర్థిక ఇబ్బందుల్లో ఉన్న సమయంలో సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించడం ద్వారా అక్రమాలను గుర్తించి, సామర్ధ్యాన్ని పెంచగలిగానన్నారు. దీంతో డబ్బు ఆదా చేయగలిగానని తెలిపారు. తాను కూడా ఎంఎస్‌ఎస్‌ఇ ఎంటర్‌ప్రెన్యుర్‌గా తన జీవితాన్ని ప్రారంభించానని తెలిపారు. తొలుత రెండు కంపెనీలను ప్రారంభించి, నష్టపోయినా, డెయిరీ ఏర్పాటు చేసి కర్నాటక, తమిళనాడు రాష్ట్రాలకు విస్తరించగలిగానన్నారు. పార్టీ, ఇతర కార్యక్రమాలకు సమయం కేటాయించాక, రెండు గంటల పాటు డెయిరీ అభివృద్ధిపై ప్రణాళికలు వేసే వాడినన్నారు. సంవత్సరంన్నర పాటు కష్టపడ్డానని తెలిపారు. పరిశ్రమల నిర్వహణలో ఒడిదుడుకులు ఉంటాయని, ఆదాయం వచ్చినప్పుడు ఖర్చు చేసి, నష్టం వచ్చినప్పుడు దిగులు పడకుండా ఉండాలన్నారు. రెండు ఒకేలా చూడగలగాలని హితపుపలికారు. ఉద్యోగం చేయడం కంటే ఉద్యోగం ఇవ్వడంలో ఆనందం ఎక్కువ ఉంటుందన్నారు. సమస్యలు లేకుండా జీవితం ఉండదని, కష్టాలను అవకాశాలుగా మార్చుకోవాలన్నారు. ఇంటర్నెట్ అందుబాటులోకి వచ్చిన తొలినాళ్లలో పార్టీ ఆఫీస్‌లో ఒక గది నిండా కంప్యూటర్లు ఉండేవని, వాటికి ఎసి సౌకర్యం కల్పించామని తెలిపారు. ఎన్టీఆర్ గదికి ఎసి ఉండేది కాదని, కంప్యూటర్ గదికి ఎసి ఉండేదన్నారు. టెక్నాలజీ జీవితాన్ని ప్రభావితం చేస్తున్నదని, భవిష్యత్తు అంతా క్లౌడ్ , కృత్రిమ మేధదేనన్నారు. రియల్‌టైమ్‌లో డేటా సేకరించి, విశే్లషించి, రియల్‌టైమ్‌లో పరిష్కారాలు సూచించే రోజులు రానున్నాయన్నారు. ఎక్కువ డేటా కలిగి ఉన్న వారే భవిష్యత్తులో కోటీశ్వరుడన్నారు. పద్ధతి ప్రకారం దృష్టి పెడితే ఏదైనా సాధ్యమన్నారు.