ఆంధ్రప్రదేశ్‌

‘రెవెన్యూ’ను మోసగిస్తే జైలుకే..!!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 27: రెవెన్యూ శాఖను మోసం చేసిన వారికి జైలు శిక్ష తప్పదని ఉప ముఖ్యమంత్రి, రెవెన్యూ శాఖ మంత్రి కెఇ కృష్ణమూర్తి అన్నారు. రికార్డుల తారుమారు, ట్యాంపరింగ్, డబుల్ రిజిస్ట్రేషన్లు తదితరాలకు శిక్షలు కఠినంగా ఉంటాయన్నారు. మోసం చేసినవారు తప్పించుకోలేరని, వారికి జైలు శిక్ష తప్పదని స్పష్టంచేశారు. తూర్పు గోదావరి జిల్లా రాజమహేంద్రవరం పార్లమెంటరీ నియోజకవర్గ ఇన్‌చార్జి మంత్రిగా వ్యవహరిస్తున్న కెఇ మంగళవారం స్థానిక ఆర్‌అండ్‌బి అతిథి గృహంలో నియోజకవర్గ పరిధిలోని ప్రజా ప్రతినిధులు, జిల్లాస్థాయి అధికారులతో సమీక్షా సమావేశాన్ని నిర్వహించారు. అనంతరం మీడియా సమావేశంలో మాట్లాడారు. గత ప్రభుత్వ హయాంలో ఎస్‌ఇజడ్ భూసేకరణలో అక్రమాలు జరిగాయని, ప్రస్తుతం వాటన్నింటిని పరిశీలించి ఎక్కడా రైతులకు అన్యా యం జరగకుండా చూస్తున్నామన్నారు. ఎన్ని సం స్కరణలు చేపట్టినా లోపాలు జరుగుతున్నాయని, చట్టాలను ఎప్పటికపుడు పటిష్టపర్చుకుంటూ సంస్కరణలు తెస్తున్నామన్నారు. విశాఖలో భూముల ట్యాంపరింగ్ అక్రమాలపై సిట్ విచారణ జరుపుతోందన్నారు.