ఆంధ్రప్రదేశ్‌

నల్లమలలో పులుల వేటగాళ్లు సమాచారం అందించండి-డిఎఫ్‌ఓ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

మహానంది, జూన్ 27: నల్లమల అడవుల్లోకి కొంతమంది పులుల వేటగాళ్లు వచ్చినట్లు సమాచారం అందిందని డిఎఫ్‌ఓ శివప్రసాద్ తెలిపారు. నలమలలో పులుల సంచారం పెరిగినందున వాటిని చంపేందుకు ఇతర రాష్ట్రాల నుంచి వేటగాళ్లు వచ్చినట్లు తమకు సమాచారం అందిందన్నారు. హర్యానా, మధ్యప్రదేశ్ రాష్ట్రాలకు చెందిన రాకేష్, భీమా, విజయ్, లీలావతి, శాంతి తదితరులు పులుల వేటకు వచ్చినట్లు తెలిసిందన్నారు. నల్లమల సమీప గ్రామాల్లో వీరు మకాం వేసినట్లు సమాచారం ఉందన్నారు. రాత్రిపూట పులుల వేటకు అడవుల్లోకి వెళ్తున్నట్లు తెలియవచ్చిందన్నారు. అటవీ సమీప గ్రామాల్లో ఎవరైనా అనుమానాస్పదంగా తిరుగుతున్నా, తెలుగు మాట్లాడడం రాని వ్యక్తుల గురించి తెలిసినా వెంటనే అటవీశాఖ అధికారులకు సమాచారం అందించాలని ఆయన ప్రజలను కోరారు. వేటగాళ్ల సమాచారం అందించిన వారికి తగిన పారితోషికం ఇస్తామన్నారు.