ఆంధ్రప్రదేశ్‌

ఆలయాల ఉద్యోగులు, అర్చకుల పోరుబాట

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూన్ 27: రాష్ట్రంలోని దేవాదాయ ధర్మాదాయ సంస్థల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులు ఆందోళన బాట పట్టనున్నారు. సుప్రీం కోర్టు ఇచ్చిన తీర్పు ప్రకారం దేవాదాయ చట్టం సెక్షన్ 65ఎ ప్రకారం అర్చకులు, ఉద్యోగులకు వేతనాలు ఇవ్వకపోవడంతోపాటు అలవెన్సుల నిధి ఏర్పాటుచేయకపోవడంతో ఆందోళనబాట పడుతున్నారు. నిన్నటి వరకు అర్చకులు, ఉద్యోగులు వేర్వేరుగా ఉండేవారు. ఇప్పుడు వీరంతా కలిసి జాయింట్ యాక్షన్ కమిటీగా ఏర్పడి ఆందోళన చేస్తున్నారు. ఇందులో భాగంగా బుధవారం రాష్ట్రంలోని 13 జిల్లాల్లో 3,135 దేవాలయాల పరిధిలోని ఉన్న 6ఎ, 6బి, 6సి, 6డి ఆలయాల్లోని అర్చకులు పంచెకట్టు, ఉద్యోగులు వారి యూనిఫారంతో నల్లబ్యాడ్జీలు ధరించి విధులు నిర్వహించడమే కాకుండా ఉదయానే్న ప్రదర్శనలు చేయనున్నారు. జూలై 6వ తేదీన గుంటూరు జిల్లా మంగళగిరిలోని నన్నపనేని కళావేదికపై ఆంధ్రప్రదేశ్ హిందూ దేవాదాయ ధర్మాదాయ సంస్థల వేతన అర్చకులు, ఉద్యోగుల మహాజన సభను నిర్వహించనున్నారు. ఇందుకు భారీ ఎత్తున ఉద్యోగులు, అర్చకులను సమీకరిస్తున్నారు. భవిష్యత్తు కార్యచరణను ఆ వేదిక పైనుంచే ప్రకటించనున్నారు. తెలంగాణ రాష్ట్రంలో అర్చకులు, ఉద్యోగులు జెఎసిగా ఏర్పడి ఉద్యమం చేశారు. ఫలితంగా ప్రభుత్వం మంత్రివర్గ ఉప సంఘం ఇచ్చిన నివేదిక ప్రకారం ఏకీకృత నిధి ఏర్పాటుచేసి అర్చకులు, ఉద్యోగుల జీతభత్యాలు చెల్లిస్తామని ఆ రాష్ట్ర ముఖ్యమంత్రి కెసిఆర్ ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌లోని అర్చకులు, జెఎసిగా ఏర్పడి ఉద్యమించాలని నిర్ణయించుకున్నారు. ఇదిలావుండగా ప్రభుత్వం విడుదల చేసిన జిఒ 820, 326, 417 అమలు చేయాలన్నది వారి ప్రధాన డిమాండ్. ఏకీకృత నిధి ద్వారా ఆలయాల్లో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగులకు 2015 పిఆర్‌సి ప్రకారం వేతనాలు చెల్లించాలి. కన్సాలిడేటెడ్, అవుట్ సోర్సింగ్, కాంట్రాక్టు పద్ధతిలో పనిచేస్తున్న అర్చకులు, ఉద్యోగుల సర్వీసులు క్రమబద్ధీకరించి, 2015 పిఆర్‌సి ప్రకారం వేతనాలు చెల్లించాలని డిమాండ్ చేశారు.