ఆంధ్రప్రదేశ్‌

విఆర్ పురానికి పాకిన మలేరియా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూన్ 27: తూర్పు గోదావరి జిల్లాలో మలేరియా మహమ్మారి మృత్యుతాండవం కొనసాగుతూనేవుంది. ఇప్పటికే జిల్లాలోని వై.రామవరం మండలంలో 16మందిని బలితీసుకున్న ఈ మహమ్మారి, ప్రస్తుతం విలీన ప్రాంతం విఆర్‌పురం మండలంలో కరాళనృత్యం మొదలెట్టింది. వారం రోజుల వ్యవధిలో ఈ మండలంలో ముగ్గురు మృతిచెందగా, చింతూరు మండలంలో మరో వ్యక్తి మృతిచెందాడు. పలువురు వ్యాధితో బాధపడుతూ చికిత్స పొందుతున్నారు. దీనితో గత నెల రోజుల వ్యవధిలో జిల్లాలో మొత్తం 20మంది మృత్యువాత పడినట్టయ్యింది. మరోపక్క తూ.గో. ఏజెన్సీలో హెల్త్ ఎమర్జన్సీ ప్రకటించాలనే డిమాండు ఊపందుకుంటోంది. వై.రామవరం మండలం చాపరాయి గ్రామంలో ఇప్పటికే ఈ వ్యాధికి 16మంది బలైన సంగతి విదితమే. తాజాగా విఆర్‌పురం, చింతూరు మండలాల్లో వారం రోజుల వ్యవధిలో మలేరియా జ్వరంతో నలుగురు మృతిచెందారు. విఆర్‌పురం మండలంలోని కల్తునూరు గ్రామానికి చెందిన గొల్ల లచ్చిరెడ్డి, శ్రీరామగిరి గ్రామానికి చెందిన యశ్వంత్ అనే విద్యార్థి మృతిచెందగా, లక్ష్మీనగరంలో ఆదిలక్ష్మి (23) అనే గిరిజన యువతి మంగళవారం మృతిచెందింది. చింతూరు మండలంలోని దర్భగూడెంకు చెందిన మడివి దేవుడమ్మ ఈ వ్యాధికే బలయ్యింది. భద్రాచలం ఎమ్మెల్యే సున్నం రాజయ్య మృతుల కుటుంబాలను పరామర్శించారు.