ఆంధ్రప్రదేశ్‌

ఇకనైనా కదలండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూన్ 27: తూర్పుగోదావరి జిల్లా గిరిజన ప్రాంతంలో చోటు చేసుకున్న మరణాలపై రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ తీరు వ్యవహరించిన తీరుపై ముఖ్యమంత్రి చంద్రబాబు అసంతృప్తి వ్యక్తం చేశారు. 16 మంది మృత్యువాత పడిన తరువాత యంత్రాంగంలో కదలిక రావడం సరికాదంటూ వ్యాఖ్యానించారు. వెలగపూడి సచివాలయంలో ఏజన్సీ ప్రాంతాల్లో గిరిజనులకు అందిస్తున్న వైద్య సేవలపై సిఎం మంగళవారం సమీక్ష నిర్వహించారు. ఐటిడిఎల పీవోలతో వీడియో కాన్ఫరెన్సు నిర్వహించారు. మంత్రి కామినేని శ్రీనివాస్ సహా వైద్య, ఆరోగ్య శాఖ, గిరిజన శాఖల అధికారులు పాల్గొన్నారు. ఈసందర్భంగా సిఎం రాష్ట్రంలోని ఐటిడిఎల పరిధిలోని 4934 గ్రామాల ప్రజల ఆరోగ్య స్థితిగతులు అడిగి తెలుసుకున్నారు. గిరిజనులు ఎక్కువగా ఉన్న 71 మండలాల్లో 803 సబ్‌సెంటర్లు, 155 పిహెచ్‌సిలు, 19 సిహెచ్‌సిలు, 7 ఎహెచ్‌లు ఉన్నట్లు సిఎంకు అధికారులు వివరించారు. పిహెచ్‌సిల్లోని 266 వైద్యాధికారుల పోస్టుల భర్తీ ప్రక్రియ ప్రారంభమైందని, 17 మినహా మిగిలిన పోస్టులను భర్తీ చేశామని వివరించారు. దీనిపై సిఎం స్పందిస్తూ, వైద్య ఆరోగ్య శాఖలో ఎన్నో సంస్కరణలు తీసుకువచ్చామన్నారు. ఎన్టీఆర్ వైద్య పరీక్ష, ఎన్టీఆర్ వైద్య సేవ, ఆరోగ్య రక్ష, చంద్రన్న సంచార చికిత్స, మహిళలకు మాస్టర్ హెల్త్ చెకప్‌లతో అందరికీ ఆరోగ్య భద్రత కల్పిస్తున్నామని తెలిపారు. గిరిజనుల ఆనారోగ్య సమస్యలకు కారణం ఏదైనా కావచ్చని, కానీ ఎంత వేగంగా స్పందించామన్నదే ముఖ్యమన్నారు. 16 మంది చనిపోయాక, యంత్రాంగం కదలడం కన్నా, ముందే గుర్తించి వైద్యం అందించాల్సి ఉందన్నారు.
మంగళవారం కొత్తగా ఆరు బృందాలను రంగంలోకి దించినట్లు సిఎంకు తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా వివరించారు. బుధవారం నుంచి ఒక్కో వైద్య శిబిరం పర్యవేక్షణకు ఒక్కో అధికారిని ప్రత్యేకంగా నియమిస్తున్నామని తెలిపారు. వైద్యాధికారుల పోస్టులను తక్షణమే భర్తీ చేయాలని, అవసరమైతే వాకిన్ ఇంటర్వ్యూలను నిర్వహించాలని అధికారులను సిఎం ఆదేశించారు. వైద్య పరీక్షలకు అవసరమైన ల్యాబరేటరీలను ఏర్పాటు చేయాలని, ఆరోగ్యకరమైన ఆహారపు అలవాట్లపై గిరిజనుల్లో అవగాహన కల్పించాలని ఆదేశించారు. మొబైల్ హెల్త్ సర్వీసులను బలోపేతం చేయాలన్నారు. చాపరాయి ఘటనపై కేస్ స్టడీ చేపట్టి, అన్ని ఐటిడిఎల్లో ముందస్తు జాగ్రత్తలు తీసుకోవాలని ఆదేశించారు. అంతకు ముందు మంత్రి కామినేని సచివాలయంలో ఐటిడిఎ పీవోలతో సచివాలయంలో సమావేశమయ్యారు. రంపచోడవరం, చింతూరులో మంత్రి, అరకు, పాడేరులో ఆ శాఖ ముఖ్య కార్యదర్శి పూనం మాలకొండయ్య పర్యటించేందుకు నిర్ణయించారు. అందరినీ సౌకర్యాలు ఉన్న ప్రాంతంలోకి తీసుకువస్తే బాగుంటుందన్నారు.

చిత్రం.. ఏజన్సీ ప్రాంతంలో వైద్యసేవలపై సమీక్షిస్తున్న ముఖ్యమంత్రి