ఆంధ్రప్రదేశ్‌

గిరిజనంపై వ్యాధుల పంజా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

పాడేరు, జూన్ 27: విశాఖ మన్యంలో ప్రాణాంతక వ్యాధులు ప్రబలి గిరిజనం మంచాన పడుతోంది. ఏజెన్సీలోని ఏ గ్రామంలో చూసినా వ్యాధులతో బాధపడుతున్నవారే. ఏటా వర్షాకాలంలో మన్యానికి జబ్బు చేయడం సర్వసాధారణం. ఈసారీ అదే పరిస్థితి. ఏప్రిల్ నుంచి సెప్టెంబర్ వరకు ఏజెన్సీలో ఎపిడమిక్ సీజన్‌గా ప్రభుత్వం పరిగణిస్తుంది. ఈ నేపథ్యంలో ముందస్తు చర్యలు తీసుకుంటున్నప్పటికీ గిరిజనాన్ని రోగాలు వెంటాడుతూనే ఉన్నాయి. గిరిజనులను పట్టిపీడిస్తున్న మలేరియా, డయేరియా, జ్వరాలు వంటి వాటికి ఈసారి ఆంత్రాక్స్ తోడైంది. అరకులోయ మండలం సిరిగాం పంచాయతీ కోడిపుంజువలసలో ఐదుగురు గిరిజనులకు ఆంత్రాక్స్ వ్యాధి లక్షణాలు ఉన్నట్టుగా వైద్యులు గుర్తించి వీరిని విశాఖపట్నం కెజిహెచ్‌కు తరలించారు. కోడిపుంజువలస గ్రామానికి చెందిన పి.గుండు, సోమన్న, మంగలయ్య, కె.క్రిష్ణ, జె.గుండు అనే గిరిజనులు ఆంత్రాక్స్ లక్షణాలతో ప్రస్తుతం కింగ్‌జార్జి ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. ఈ గిరిజనుల నుంచి రక్త నమూనాలను సేకరించిన వైద్యులు వ్యాధి నిర్థారణకు గ్వాలియర్‌కు పంపించారు. గ్వాలియర్‌లో కల్చర్ పరీక్షలు నిర్వహించి నివేదిక అందితేగాని వీరికి ఆంత్రాక్స్ సోకిందా లేదా అన్న అంశం నిర్థారణ కాదని వైద్యులు చెబుతున్నారు. అయితే ప్రాధమికంగా ఉన్న సమాచారం ప్రకారం ఈ ఐదుగురు గిరిజనులకు ఆంత్రాక్స్ లక్షణాలు ఉన్నట్టుగానే భావిస్తుండడంతో మన్యంలో ఆంత్రాక్స్ కలకలం మొదలయ్యింది. ఇప్పటికే మలేరియాతో సతవౌతవౌతుండగా ఆంత్రాక్స్ ప్రబలడంతో గిరిజనులు ఆందోళన చెందుతున్నారు. విశాఖ ఏజెన్సీలో తొలిసారిగా 2009లో ఆంత్రాక్స్ ప్రబలింది. ముంచంగిపుట్టు మండలం లక్ష్మీపురం పంచాయతీ కర్లాపొదర్, మద్దుగుడలో అప్పట్లో 13 మంది గిరిజనులకు ఆంత్రాక్స్ సోకగా వీరిలో ఇద్దరు గిరిజనులు మృత్యువాత పడ్డారు. దీంతో వైద్య ఆరోగ్య శాఖ హూటాహుటిన రంగంలోకి దిగి ముంచంగిపుట్టు మండలంలోని అన్ని గ్రామాల్లో ఆంత్రాక్స్ బ్యాక్టీరియా వ్యాప్తికి కారణమయ్యే పశువులకు ప్రత్యేక పరీక్షలు చేపట్టారు. కర్లాపొదర్ గ్రామం నుంచి ప్రారంభమైన ఆంత్రాక్స్ అరకులోయ మండలం కోడిపుంజువలస గ్రామానికి పాకి గిరిజనులను ఆందోళనకు గురిచేస్తోంది. గత మూడేళ్లుగా ఏజెన్సీలో ఎక్కడో ఒకచోట దీని ప్రభావం కనిపిస్తూనే ఉంది. 2015లో హుకుంపేట మండలం ఉర్రాడ బొడ్డాపుట్టు గ్రామంపై ఆంత్రాక్స్ దాడి చేయడంతో తొమ్మిది మంది గిరిజనులు కింగ్‌జార్జి ఆసుపత్రిలో చికిత్స పొందారు.
ఇదిలాఉండగా మన్యంలో ఇప్పటికే మలేరియా తన ప్రతాపాన్ని చూపిస్తోంది. ఏజెన్సీలోని పదకొండు మండలాల పరిధిలో ఉన్న 3 వేల 574 గ్రామాలలో అత్యధిక శాతం గ్రామాల గిరిజనులు మలేరియా బారినపడినట్టు తెలుస్తోంది. మలేరియా బారిన పడుతున్న గిరిజనుల సంఖ్య వందలలో ఉంటున్నప్పటికీ ఆసుపత్రుల్లో పరీక్షలు చేయించుకుంటున్న వారి సంఖ్య తక్కువగా నమోదవుతుండడంతో అధికారికంగా దీనితీవ్రత తెలియరావడం లేదు. వైద్య ఆరోగ్య శాఖ అధికారికంగా నిర్థారించిన దానిప్రకారం ఈ సంవత్సరం జూన్ 18 నాటికి ఏజెన్సీలో ఒక వెయ్యి 682 మంది గిరిజనులకు మలేరియా సోకినట్టు తేలింది. ప్రభుత్వ ఆసుపత్రుల్లోనే కాకుండా ప్రైవేట్ ఆసుపత్రుల్లో కూడా వందల సంఖ్యలో మలేరియా కేసులు నమోదవుతున్నాయి. జి.మాడుగుల సర్పంచ్ మత్స్యరాస మత్స్యరాజు మలేరియాతో ఈ నెల 26న మృతి చెందారు.

చిత్రం.. ఆంత్రాక్స్ బారినపడ్డ విశాఖ మన్యంలోని కోడిపుంజువలస గ్రామం(ఆసుపత్రిలో రోగులు)