ఆంధ్రప్రదేశ్‌

పెండింగ్ ప్రాజెక్ట్‌లు పూర్తిచేస్తే సీమ సస్యశ్యామలం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు ఓల్డ్‌సిటీ, మే 5: కృష్ణా, తుంగభద్ర నదులపై తలపెట్టిన ప్రాజెక్టులకు సంబంధించి సమస్యలుంటే ఇరు రాష్ట్రాలు చర్చల ద్వారా సామరస్యంగా పరిష్కరించుకుంటే తెలంగాణ, ఆంధ్ర రాష్ట్రాల్లోని కరవుపీడిత ప్రాంతాలు సస్యశ్యామలం అవుతాయని బిజెపి మహిళా మోర్చా జాతీయ అధ్యక్షురాలు, కేంద్ర మాజీమంత్రి పురంధ్రీశ్వరి అన్నారు. గురువారం కర్నూలు జిల్లాలో తుంగభద్ర నదిపై గుండ్రేవుల వద్ద నిర్మించేబోయే రిజర్వాయర్, ఆర్డీఎస్, సంగమేశ్వరంలోని సిద్దేశ్వరం అలుగులను ప్రాజెక్ట్‌ల సందర్శనలో భాగంగా బిజెపి బృందం పరిశీలించింది. ఈ బృందంలో రాష్ట్ర దేవాదాయశాఖ మంత్రి మాణిక్యలారావు, బిజెపి రాష్ట్ర ఉపాధ్యక్షుడు కపిలేశ్వరయ్య, మాజీ ఎమ్మెల్యేలు కాటసాని రాంభూపాల్‌రెడ్డి, పార్థసారథి, బిజెపి రాష్ట్ర ప్రధాన కార్యదర్శులు సురేష్‌రెడ్డి, రవీంద్రరాజు, కర్నూలు జిల్లా అధ్యక్షులు హరీష్‌బాబు, కడప జిల్లా నాయకులు హరినాథ్‌రెడ్డి, శశిభూషణ్‌రెడ్డి ఉన్నారు. పురంధ్రీశ్వరి, దేవాదాయ శాఖ మంత్రి మాణిక్యాలరావు మాట్లాడుతూ రాయలసీమలోని పెండింగ్ ప్రాజెక్టులను పూర్తి చేస్తే కరవుకాటకాలతో అల్లాడుతున్న ఈ ప్రాంతం సస్యశ్యామలం అవుతుందని అన్నారు. కృష్ణానదిపై సిద్దేశ్వరం అలుగు నిర్మాణం చేపడితే సుమారు 50 టిఎంసిల నుండి 60 టిఎంసిల వరకు నీరు నిల్వ అవుతుందని తద్వారా రాయలసీమలోని కర్నూలు, అనంతపురం, చిత్తూరు, కడపతో పాటు ప్రకాశం, నెల్లూరు జిల్లాలకు తాగు, సాగునీటి సమస్య తలెత్తకుండా నీటిని అందించవచ్చన్నారు. సిద్దేశ్వరం అలుగు రాయలసీమకు ఎంతో అవసరమని దీనిపై ముఖ్యమంత్రికి నివేదిక ఇస్తానని ఆయన చెప్పారు.