ఆంధ్రప్రదేశ్‌

పెరిగిన మద్యం ధరలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 4: రాష్ట్రంలోని మందు బాబులకు ప్రభుత్వం జలక్ ఇచ్చింది. మద్యం ధరలను అమాంతం పెంచేసింది. పెరిగిన గరిష్ఠ చిల్లర ధరలు (ఎమ్మార్పీ) మంగళవారమే అమల్లోకి వచ్చేశాయి. ఇప్పటికే కొత్త మద్యం విధానంతో రాష్ట్రంలో గందరగోళ పరిస్థితులు నెలకొన్న నేపథ్యంలో దుకాణదారులే అనధికారికంగా ధరలు పెంచి విక్రయాలు జరుపుతుండగా, కొత్తగా ధరల పెంపు మరింత భారం మోపనుంది. రాష్టవ్య్రాప్తంగా మద్యం దుకాణాల్లో విక్రయించే సుమారు 400 రకాల మద్యం ధరలను ప్రభుత్వం పెంచింది. గతంలో మద్యం బాటిల్ ఎమ్మార్పీపై 20 శాతం వ్యాపారులకు మార్జిన్ ఉండేది. కొత్త మద్యం పాలసీలో దీన్ని 10 శాతానికి కుదించారు. పెరిగిన మద్యం ధరలను పరిశీలిస్తే అన్ని బ్రాండ్లకు బాదుడు తప్పలేదు. బ్లాక్ డాగ్ రేర్ విస్కీ 750 మిల్లీ లీటర్లు పాత ధర రూ.4,350కాగా కొత్త ధర రూ.4,600గా నిర్ణయించారు. అంటే బాటిల్‌పై రూ.250 పెరిగింది. స్కాచ్ విస్కీ పాత ధర రూ.6,370, కాగా కొత్త ధర రూ.6,740 అంటే రూ.370 పెరిగింది. యాంటిక్యుటీ ఫుల్ పాత ధర రూ.1,060 కాగా, కొత్త ధర రూ.1110. బకార్డీ యాపిల్ ఫుల్ పాత ధర రూ.390, కొత్త ధర రూ.410 రూ.20 పెరిగింది. బ్లెండెడ్ విస్కీ పాత ధర రూ.1700, కొత్త ధర రూ.1800. ప్రీమియం విస్కీ పాత ధర రూ.1460కాగా కొత్త ధర రూ.1540. నెపోలియం బ్రాందికి రూ.10, ఫ్రెంచ్ బ్రాందీకి రూ.50, ఫ్రెంచ్ గ్రేప్ బ్రాందీ పాత ధర రూ.1650కాగా కొత్త ధర రూ.1750. ఇలా అన్ని బ్రాండ్‌ల మీద ప్రభుత్వం ధరలను పెంచింది. రాష్ట్రంలో ఉన్న 4363 మద్యం దుకాణాలు, 800 బార్లకు ఈ పెరిగిన ఎంఆర్‌పి ధరలు వర్తిస్తాయి.