ఆంధ్రప్రదేశ్‌

రైతుల భాగస్వామ్యంతోనే వాటర్‌షెడ్ విజయవంతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: నీరాంచల్ జాతీయ నీటి పరీవాహక ప్రాంత (వాటర్‌షెడ్) పథకం రైతుల భాగస్వామ్యంతో అమలు చేస్తే ఉత్తమ ఫలితాలు రాబట్టవచ్చని పంచాయతీరాజ్ శాఖ కమిషనర్ రామాంజనేయులు అన్నారు. విజయవాడ బందర్ రోడ్డులోని హోటల్ గేట్‌వేలో దీనిపై మంగళవారం ఏర్పాటు చేసిన ఒకరోజు వర్క్‌షాప్‌లో ఆయన ముఖ్యఅతిథిగా మాట్లాడారు. కేంద్ర ప్రభుత్వం అమలు చేస్తున్న వాటర్‌షెడ్ పథకం నీరాంచల్ పైలట్ ప్రాజెక్టుగా రాష్ట్రంలో కర్నూలు, అనంతపురం జిల్లాలను ఎంపిక చేశామన్నారు. దేశవ్యాప్తంగా 9 రాష్ట్రాల్లో ఈ ప్రాజెక్టును అమలు చేయడానికి కేంద్ర ప్రభుత్వం చర్యలు తీసుకుందన్నారు. దీనికోసం రూ. 200కోట్ల బడ్జెట్‌ను కేటాయించారన్నారు. నీరాంచల్ వాటర్‌షెడ్ పథకం వల్ల భూగర్భ జలమట్టం పెరగడంతో పాటు ఉత్తమ నీటి యాజమాన్య పద్ధతులు అమలు చేయడానికి అవకాశముందన్నారు. దీనివల్ల నీటి ఆవశ్యకత, వినియోగంపై రైతులకు పూర్తి అవగాహన ఏర్పడుతుందన్నారు. ఈ పథకం రైతులకు ఉద్దేశించిందని, వారిని ఇందులో భాగస్వాముల్ని చేయడం వల్ల పంట దిగుబడి పెంచడంతో పాటు మేలైన నీటి సామర్థ్య పద్ధతుల అమలుకు వీలవుతుందన్నారు. రాష్టస్థ్రాయిలో నోడల్ ఏజెన్సీగా గ్రామీణాభివృద్ధి శాఖ వ్యవహరిస్తుందని ఆయన తెలిపారు. ఆరేళ్ల కాలంలో ఈ ప్రాజెక్టు అమలులో ఉంటుందన్నారు. స్వాతంత్య్రం వచ్చిన దగ్గర నుంచి రైతుల కోసం ఆశించిన మేర కార్యక్రమాలకు రూపకల్పన చేయకపోవడం వల్ల అనుకున్న ఫలితాలు రాలేదన్నారు.
వాటర్‌షెడ్ పథకాల్లో సామాజికవేత్త అన్నా హజారేను ఆదర్శంగా తీసుకోవలసిన అవసరముందన్నారు. ఏ పథకానైనా ఆచరించి అమలుచేస్తే లక్ష్యాలను చేరుకునే వీలవుతుందని రామాంజనేయులు స్పష్టం చేశారు. ఐడబ్ల్యుఎంపి (వాటర్‌షెడ్) జాయింట్ కమిషనర్ ఎం శివప్రసాద్, గ్రౌండ్ వాటర్ శాఖకు చెందిన డా. కె వేణుగోపాల్, ఏపి స్పేస్ అప్లికేషన్ సెంటర్ వైస్ చైర్మన్ డా. కెవి రమణ, నాబార్డ్ ఎజిఎం డిపి ఆచార్య, ఎన్జీ రంగా వ్యవసాయ విశ్వవిద్యాలయానికి చెందిన డాక్టర్ ఎం రఘుబాబు, తదితరులు పాల్గొన్నారు.
రాష్ట్రానికి రూ.200 కోట్లు
ప్రజల భాగస్వామంతోనే పథకాలు విజయవంతం అవుతాయని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ అన్నారు. వర్క్‌షాప్‌లో ఆయన మాట్లాడుతూ గతంలో అమలుచేసిన పథకాల్లో లోపాలను సరిచేసి, నూతన సాంకేతిక పరిజ్ఞానాన్ని వినియోగించుకుని మరింత పటిష్టంగా అమలు చేయడమే ఈ ప్రాజెక్టు ఉద్దేశ్యమన్నారు.
గత రెండేళ్లతో పోలిస్తే ఈ ఏడాది వర్షపాతం ఆశాజనకంగా ఉందని, మొక్కలు నాటి పచ్చదనాన్ని పెంచాలని కోరారు. ఆరేళ్ల పాటు సాగే ఈ పథకం కింద రాష్ట్రానికి 200 కోట్ల రూపాయలను కేంద్రం కేటాయించిందని తెలిపారు. దేశంలో 9 రాష్ట్రాల్లో ఈ పథకం అమలవుతోందని తెలిపారు. మొత్తం నిధుల్లో కేంద్రం 60 శాతం, రాష్ట్రం 40 శాతం సమకూరుస్తాయని తెలిపారు. హెక్టారుకు 40 వేల రూపాయలు ఖర్చు చేస్తారని ఆయన వివరించారు.

చిత్రం.. వాటర్‌షెడ్‌పై జరిగిన వర్క్‌షాప్‌లో మాట్లాడుతున్న రామాంజనేయులు