ఆంధ్రప్రదేశ్‌

జగన్ సిఎం కావాలనే వైకాపాలో చేరుతున్నా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 4: వైకాపా అధ్యక్షుడు, ప్రతిపక్ష నేత వైఎస్ జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రి కావాలనే ఉద్దేశ్యంతోనే తాను వైకాపాలో చేరుతున్నట్లు కాంగ్రెస్ మాజీ ఎమ్మెల్యే మల్లాది విష్ణు అన్నారు. మంగళవారం ఆయన ఇక్కడ లోటస్‌పాండ్‌లో వైఎస్ జగన్‌ను కలిశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ త్వరలో విజయవాడలో భారీ ఎత్తున బహిరంగ సభ నిర్వహిస్తున్నట్లు చెప్పారు. తన ఆధ్వర్యంలో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు వైకాపాలో చేరుతున్నట్లు ఆయన చెప్పారు.
ఆంధ్రప్రదేశ్‌లో చంద్రబాబు పాలనతో ప్రజలు విసిగిపోయారని, తీవ్ర అసంతృప్తితో ఉన్నారన్నారు. చంద్రబాబు పాలనకు చరమగీతం పాడేందుకు వైకాపాను బలోపేతం చేసేందుకు తాను ఈ పార్టీలో చేరుతున్నట్లు చెప్పారు. జగన్ నాయకత్వాన్ని భేషరతుగా మద్దతు ఇస్తున్నుట్ల చెప్పారు. సీటు కోసం తాను వైకాపాలో చేరడం లేదన్నారు.
ఆంధ్రప్రదేశ్ పూర్వ ప్రధాన కార్యదదర్శి ఐవైఆర్ కృష్ణారావుపై చంద్రబాబు ప్రభుత్వం అనుసరించిన వైఖరి గర్హనీయమన్నారు. తనకు వైఎస్ రాజశేఖర రెడ్డి కుటుంబంతో 40 ఏళ్ల అనుబంధం ఉందన్నారు. లోటస్‌పాండ్‌కు రావడం, తన కుటుంబానికి తిరిగి వచ్చినట్లుగా ఆనందంగా ఉందని విష్ణు పేర్కొన్నారు.