ఆంధ్రప్రదేశ్‌

కోవింద్‌కు రాష్ట్ర బిజెపి నేతల ఘన స్వాగతం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 4: ముఖ్యమంత్రి ఎన్ చంద్రబాబు నాయుడు, కేంద్ర మంత్రి ఎం వెంకయ్య నాయుడు, బిజెపి జాతీయ ప్రధాన కార్యదర్శి పి మురళీధర్‌రావు సమక్షంలో ఎన్డీఏ రాష్టప్రతి అభ్యర్థి రామ్‌నాథ్ కోవింద్ ఆంధ్ర రాష్ట్ర పర్యటనకు వచ్చిన సందర్భంగా గన్నవరం విమానాశ్రయంలో బిజెపి రాష్ట్ర అధ్యక్షుడు కంభంపాటి హరిబాబు, ఇతర నేతలు ఘన స్వాగతం పలికారు. బిజెపికి చెందిన రాష్ట్ర మంత్రులు కామినేని శ్రీనివాస్, పి మాణిక్యాలరావు, ఎంపి గోకరాజు గంగరాజు, ఎమ్మెల్యేలు విష్ణుకుమార్ రాజు, ఆకుల సత్యనారాయణ, ఎమ్మెల్సీలు సోము వీర్రాజు, పివిఎన్ మాధవ్, మాజీ కేంద్ర మంత్రి కావూరి సాంబశివరావు, మాజీ రాష్ట్ర మంత్రి కన్నా లక్ష్మీనారాయణ, రాష్ట్ర బిజెపి సంఘటనా ప్రధాన కార్యదర్శి జిఆర్ రవీంద్రరాజు, జాతీయ కార్యవర్గ సభ్యులు శాంతారెడ్డి, రాష్ట్ర నాయకులు వి శ్రీనివాసరాజు, ఎస్సీ మోర్చా జాతీయ కార్యదర్శి డిసి రోశయ్య, రాష్ట్ర అధ్యక్షుడు దారా సాంబయ్య, మైనార్టీ మోర్చా రాష్ట్ర అధ్యక్షుడు షేక్ బాజీ, రాష్ట్ర మహిళా మోర్చా అధ్యక్షురాలు శరణాల మాలతీరాణి, బిజెపి కృష్ణా జిల్లా అధ్యక్షుడు చిగురుపాటి కుమారస్వామి, నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.