ఆంధ్రప్రదేశ్‌

ఆర్టీసీ ప్రైవేటీకరణ అబద్ధం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 4: ఏపిఎస్ ఆర్టీసీని ప్రైవేటీకరిస్తారనే ప్రచారం అవాస్తవమని రవాణా శాఖ మంత్రి కె అచ్నెన్నాయుడు స్పష్టం చేశారు. విజయవాడలో ఆర్టీసీ సిబ్బంది ఆస్పత్రిని ఆయన మంగళవారం ప్రారంభించారు. ఈసందర్భంగా మంత్రి మాట్లాడుతూ ప్రైవేటీకరణ ఉద్దేశ్యం ప్రభుత్వానికి ఏమాత్రం లేదని, అవాస్తవ ప్రచారాలు పరిగణనలోకి తీసుకోవాల్సిన అవసరం లేదన్నారు. హైదరాబాద్ తార్నాక ఆస్పత్రిలో ఏపి కార్మికులకు వైద్యం నిరాకరించడం బాధించిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఆర్టీసీకి చెల్లించాల్సిన రాయితీ బకాయిలు ఎప్పటికప్పుడు చెల్లిస్తామని చెప్పారు. ఆర్టీసీ ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు 60ఏళ్లకు పెంచేలా చర్యలు తీసుకుంటామన్నారు. సమైక్యాంద్ర సమ్మె కాలాన్ని క్యాజువల్ లీవ్‌గా పరిగణిస్తామని, త్వరలో ఆర్టీసీ బోర్డును నియమిస్తామని అచ్చెన్నాయుడు వివరించారు.
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ మాట్లాడుతూ ఆర్టీసీ ఆస్పత్రిలో కార్పొరేట్ స్థాయి సౌకర్యాలు కల్పిస్తామని, ప్రభుత్వ ఆస్పత్రులపై నమ్మకం పెంచేందుకే తాను గుంటూరులో శస్తచ్రికిత్స చేయించుకున్నానని చెప్పారు. అనంతరం డిజిపి నండూరి సాంబశివరావు మాట్లాడుతూ తార్నాక ఆస్పత్రిలో ఏపి కార్మికులతో హేళనగా మాట్లాడారని అన్నారు. కార్మికుల పట్టుదలతో ఆస్పత్రి నిర్మాణం సాధ్యమైందన్నారు. ఎయిరిండియా పరిస్థితి ఆర్టీసీకి రాకూడదని కామినేని ఆకాంక్షించారు.