ఆంధ్రప్రదేశ్‌

50 మార్కుల పేపరు 75కి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, మే 5: బిఎస్సీ కెమిస్ట్రీ పరీక్ష పేపర్ లీక్ ఉదంతం మరిచిపోక ముందే ఎన్విరాన్‌మెంటల్ సైన్సు పరీక్ష పేపరును 50 మార్కులకు బదులు 75 మార్కులకు సెట్ చేసి ఆంధ్ర విశ్వవిద్యాలయం అధికారులు తమ నిర్వాకం వెలగబెట్టారు. కేంద్ర మానవ వనరుల అభివృద్ధిశాఖ ర్యాంకింగ్‌కు దరఖాస్తు చేయడంలో నిర్లక్ష్యంగా వ్యవహరించిన ఎయు అధికారులు తాజాగా మరోసారి విమర్శలపాలయ్యారు. ఎయు పరిధిలోని దాదాపు 300 కళాశాలల్లో డిగ్రీ మొదటి సంవత్సరం పరీక్షల్లో భాగంగా గురువారం ఎన్విరాన్‌మెంటల్ సైన్సు పరీక్ష నిర్వహించారు. సాధారణంగా ఈ ప్రశ్నపత్రం గరిష్ఠంగా 50 మార్కులకు ఉంటుంది. అయితే 75 మార్కులకు సెట్ చేశారు. ప్రశ్నపత్రం అందుకున్న విద్యార్థులు అవాక్కయ్యారు. కనీస సమాచారం లేకుండా గరిష్ఠ మార్కులను పెంచడంతో విస్మయానికి గురయ్యారు. పరీక్షా కేంద్రాల్లో గందరగోళం నెలకొంది. దీంతో ఆయా కళాశాలల యాజమాన్యాలు ఎయు అధికారులను సంప్రదించారు. జవాబు తెలిసిన అన్ని ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సిందిగా ఎయు అధికారులు ఆదేశించారు. దీంతో గందరగోళానికి తెరపడింది. ఈ విషయమై ఎయు రిజిస్ట్రార్ ఆచార్య వి.ఉమా మహేశ్వరరావు స్పందిస్తూ పొరపాటు జరిగిందని, అయితే మూల్యాంకనం మాత్రం 50 మార్కులకే చేస్తామని స్పష్టం చేశారు. సిలబస్‌లో లేని ప్రశ్నలు వస్తే ఆలోచించాల్సి ఉందని, లేకుంటే ఆ మార్కులను 50కి కుదిస్తామన్నారు. విద్యార్థులు ఆందోళన చెందాల్సిన అవసరం లేదన్నారు.