ఆంధ్రప్రదేశ్‌

టిడిపిలోకి వైకాపా ఎమ్మెల్యే

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, మే 6: వైకాపాకు రాజీనామా చేసి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో శనివారం తెలుగుదేశం పార్టీలో పార్టీలో చేరుతున్నట్టు కర్నూ లు వైకాపా ఎమ్మెల్యే ఎస్వీ మోహన్‌రెడ్డి తెలిపారు. కర్నూలులో శుక్రవారం జరిగిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ కర్నూలు నగరాభివృద్ధి కోసం ప్రస్తుత ప్రభుత్వం చేపట్టిన అనేక పథకాలు, కార్యక్రమాలకు పూర్తి స్థాయి తోడ్పాటునందించి అభివృద్ధి పథంలో నడిపిస్తామని, అధిక సంఖ్య లో ఉన్న మైనారిటీలకు అవసరమైన సహకారమందిస్తామని ముఖ్యమంత్రి తనకు హామీ ఇచ్చారని తెలిపారు. చంద్రబాబు సహకారంతో కర్నూలును ఆదర్శ నగరంగా తీర్చిదిద్దడమే తన లక్ష్యమని ఆయన పేర్కొన్నారు. కర్నూలు నగరంలో తన నిర్ణయం ఎవరికి బాధ కలిగించినా క్షమించాలని కోరారు. తనతో రాని వారిని బలవంతం చేయదల్చుకోలేదన్నారు. వారి అభీష్టం మేరకు నడుచుకునే స్వేచ్చ వారికుందని ఆయన అన్నారు. తాను ఎలాంటి ప్రలోభాలకు లొంగి పార్టీ మారటం లేదన్నారు. అలాంటి అవసరం తనకు లేదన్నారు. తన కుటుంబంలో చిచ్చు పెట్టే ప్రయత్నాలు నచ్చకే పార్టీ మారుతున్నానన్నారు. ఈ సమావేశంలో ఎస్వీ మద్దతుదారులు పలువురు పాల్గొన్నారు.