ఆంధ్రప్రదేశ్‌

టాస్క్ఫోర్స్ సిబ్బందిపై ‘ఎర్ర’కూలీల రాళ్లదాడి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుమల, మే 7: తిరుమల శేషాచల అడవుల్లో ఎర్రచందనాన్ని అక్రమంగా తరలిస్తున్న కూలీలు అటవీశాఖ బేస్ క్యాంపు, స్ట్రైకింగ్ ఫోర్స్ సిబ్బందిపై తిరగబడి దాడిచేసిన సంఘటన శుక్రవారం అర్ధ రాత్రి జరిగింది. కూలీలు తమ వద్ద ఉన్న కత్తులు, గొడ్డళ్లతో సిబ్బందిపై దాడికి ప్రయత్నించారు. దీంతో పోలీసులు వారిని వెంటాడటంతో ఎర్రచందనం కూలీలు దుంగలను వదిలి పారిపోయారు. ఈ సందర్భంగా వారు వదిలివెళ్లిన రూ. 50 లక్షల విలువచేసే ఎర్రచందనం దుంగలను సిబ్బంది స్వాధీనం చేసుకుని తిరుపతికి తరలించారు. శేషాచలం అడవుల్లో విస్త్రృతంగా కూంబింగ్ చేస్తున్న అటవీ, పోలీస్ శాఖ సిబ్బందికి తిరుమలకు 16 కిలో మీటర్ల దూరంలోని గెంజిబండ వద్ద ఎర్రకూలీలు తారసపడ్డారు. లొంగిపొమ్మని తొలుతగా పోలీసులు కూలీలను హెచ్చరించారు. అయితే కూలీలు వారి హెచ్చరికను లెక్కచేయకుండా తమవద్ద ఉన్న ఎర్రచందనం దుంగలను వదిలివేసి సమీపంలోని ఎత్తయిన ప్రాంతంలోకి పరుగులు తీశారు. సిబ్బంది వారి వెంటపడ్డారు. అయితే వెంటనే కూలీలు తాము ముందస్తుగా సిద్ధం చేసుకున్న రాళ్లను, చేతిలోని గొడ్డళ్ళను సిబ్బందిపై విసిరారు. అక్కడ పరిస్థితి కూలీలు దాడి చేయడానికి అనుకూలంగా ఉండడంతో సిబ్బంది వెంటనే వెనుదిరిగి వారు వదలివెళ్లిన 23 ఎర్రచందనం దుంగలను, ఒక గొడ్డలిని స్వాధీనం చేసుకున్నారు.