ఆంధ్రప్రదేశ్‌

కమలంతో కయ్యమేల?

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, మే 8:‘ప్రత్యేక హోదా ఆంధ్రుల హక్కు. ఈ అంశాన్ని విస్మరించం. కేంద్ర ప్రభుత్వంపై వత్తిడి తెస్తూనే ఉండాలి కాని ఇప్పటికిప్పుడు బిజెపితో తెగతెంపులు ఆలోచన చేయొద్దు’ అంటూ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హితవు పలికారు. విదేశీ పర్యటనకు వెళ్లేముందు ఆయన ఆదివారం రాత్రి తన క్యాంపు కార్యాలయంలో ముఖ్యమైన మంత్రులతో సమావేశమై ప్రధానంగా ప్రత్యేక హోదా అంశంపై చర్చించారు. అసలు విభజన చట్టంలో మనకు కల్పించిన హక్కులు, అలాగే పార్లమెంట్‌లో ఇచ్చిన హామీల ఉల్లంఘనలో కేంద్ర ప్రభుత్వం ఆంతర్యం ఏ మాత్రం అంతుబట్టటం లేదన్నారు. అయితే ఇందుకు కారణాలేమిటో గుర్తించాల్సి ఉందంటూనే దీనిపై కేంద్రంపై ఏ ఒక్కరు కూడా పూర్తిస్థాయిలో ధ్వజమెత్తవద్దన్నారు. అలాగే తెలుగుదేశం ప్రభుత్వంపై బిజెపి నేతలు ఇటీవలి కాలంలో విమర్శల జోరు తగ్గించడాన్ని కూడా మనం పరిగణనలోకి తీసుకోవాల్సి ఉందన్నారు. విదేశీ పర్యటన నుంచి తిరిగి వచ్చిన తర్వాత త్వరలోనే ఢిల్లీలో ముఖ్యమంత్రుల సమావేశం జరగబోతున్నదని ఆ సందర్భంగా తానే స్వయంగా ప్రధాన మంత్రి నరేంద్ర మోదీతో ఈ అంశాలన్నింటిపై నిర్మొహమాటంగా మాట్లాడగలనని తెలిపారు. విపక్షాలు డిమాండ్ చేస్తున్నట్లుగా అఖిలపక్షాన్ని వెంట పెట్టుకుని ఢిల్లీ వెళ్లే ఆలోచన ఏ మాత్రం లేదని చంద్రబాబు తేల్చి చెప్పారు. ప్రత్యేక హోదాపై వారు ఆందోళనలు ఇక్కడ చేయటం కాదు. ఢిల్లీ వెళ్లి ఆందోళనలు చేపట్టి కేంద్రంపై వత్తిడి తెస్తే తనకెలాంటి అభ్యంతరం లేదన్నారు. చాలాకాలం తర్వాత అందునా ప్రస్తుత వేసవి కాలంలో రాష్ట్రాన్ని వీడి వెళ్తున్నాను. మంత్రులందరూ తమ తమ పరిధుల్లో ఎవరికి ఎలాంటి ఇబ్బంది ఎదురుకాకుండా అప్రమత్తంగా వ్యవహరించాలంటూ హితవు చెప్పా రు. అనంతరం బాబు కుటుంబ సమేతంగా స్విట్జర్లాండ్ బయలుదేరి వెళ్లారు. ఆయన ఈ నెల 14న తిరిగి వస్తారు.

చిత్రం... విజయవాడ క్యాంపు కార్యాలయంలో అమృత్ పథకంపై సమీక్షిస్తున్న చంద్రబాబు