ఆంధ్రప్రదేశ్‌

డిఎస్సీ అభ్యర్థి బలవన్మరణం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తిరుపతి, జూలై 16: దేశానికి ఉత్తమ పౌరులను అందించే ఉపాధ్యాయ వృత్తిని చేపట్టాలని ఎంతో ఆశగా ఎదురుచూసి, 19 సంవత్సరాలు నిరీక్షించిన 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థి మారుసాని నాదమునిరెడ్డి తన ఆశలను చంపుకుని శనివారం ఆత్మహత్యకు పాల్పడ్డాడు. చిత్తూరు జిల్లాలోని కార్వేటినగరం మండలం, ఆర్కేవిబి పేటకు చెందిన మారుసాని నాదముని అంత్యక్రియలు ఆదివారం స్వగ్రామంలో బంధువులు, కుటుంబ సభ్యులతో పాటుగా 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థుల కన్నీటి వీడ్కోలు మధ్య జరిగాయి. ఆయనకు భార్య, కుమారుడు ఉన్నారు. 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ అభ్యర్థులకు ఉద్యోగాలివ్వాలని నాదమునిరెడ్డి పలువురు ముఖ్యమంత్రులు, ప్రజాప్రతినిధులకు వినతిపత్రాలు అందించారు. అయినా ఫలితం లేకపోవడంతోనే ఆయన బలవన్మరణానికి పాల్పడినట్లు కుటుంబ సభ్యులు చెబుతున్నారు. కాగా ఇప్పటికైనా ప్రభుత్వం క్వాలిఫైడ్ టీచర్లకు తక్షణమే ఉద్యోగాలను కల్పిస్తూ జీఓ జారీ చేసి మిగిలినవారి జీవితాల్లోనైనా వెలుగులు నింపాలని 1998 డిఎస్సీ క్వాలిఫైడ్ టీచర్స్ యూనియన్ అధ్యక్షుడు ధర్మలింగారెడ్డి, కార్యదర్శి ఎం.గోవిందరాజు ఆదివారం ఒక ప్రకటనలో ప్రభుత్వానికి విజ్ఞప్తి చేశారు.