ఆంధ్రప్రదేశ్‌

‘మేల్ టూ మేల్’ అంటూ బ్లాక్ మెయిల్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం(క్రైం), జూలై 16: ‘మేల్ టూ మేల్ (స్వలింగ సంపర్కం) పేరుతో ఫేస్‌బుక్ ఖాతాని సృష్టించి, ఓ ఉద్యోగిని బ్లాక్‌మెయిల్ చేసి రూ.రెండు లక్షలు వసూలు చేసిన ఐదుగురు యువకులను విశాఖ పోలీసులు అరెస్టు చేశారు. నగరంలోని ఎంవిపి కాలనీకి చెందిన తాడి రాహుల్ (24) ఫేస్‌బుక్‌లోని మేల్ టూ మేల్ (స్వలింగ సంపర్కం)ఖాతాకు ఆకర్షితుడయ్యాడు. ఈ ఖాతాలో ఉన్న ముక్కాల ఆదిత్య(20)తో పరిచయమై స్వలింగ సంపర్కం కోసం వీరిద్దరూ చాటింగ్ చేశారు. దీంతో ఆదిత్యను కలవాలని రాహుల్ కోరాడు. వీరిద్దరు స్వలింగ సంపర్కం చేసుకోవడానికి ఈ నెల 12న ఎంవిపి కాలనీలోని ఓ ప్రైవేట్ హాస్టల్‌లోని గదిలోకి వెళ్ళారు. గదిలోకి వెళ్లిన వెంటనే రాహుల్‌ను ఆదిత్య వివస్త్రం చేయగానే ఆదిత్య స్నేహితులైన ఆమీరుద్ధీన్ ఖాన్, పి.ఆరుణ్‌కుమార్, రవిరాజ్ ఉంగరాల, డి.జతీష్ గదిలోకి ప్రవేశించారు. తాము టాస్క్ఫోర్స్ పోలీసులమని ఖాన్, కుమార్ చెప్పగా, రవిరాజ్, జతీష్ విలేఖరులమని చెప్పి ఫోటోలు తీసి, రాహుల్‌ను బెదిరించారు. ఫోటోలు బయటకు వస్తే పరువుపోతుందని చెప్పడంతో వారంతా డబ్బులు డిమాండ్ చేశారు. దీంతో రెండు దఫాలుగా రూ.రెండు లక్షలను ఎటిఎం ద్వారా రాహుల్ వారికి ఇచ్చాడు. స్నేహితుని ద్వారా బాధితుడు రాహుల్ సైబర్ క్రైం పోలీసులను ఆశ్రయించడంతో వీరి గుట్టు రట్టయ్యింది. ఇలానే గతంలో కూడా నిందితులు పలువురిని మోసం చేసినట్టు పోలీసుల దర్యాప్తులో తేలింది. వీరిని అరెస్టు చేసి జైలుకు పంపిస్తున్నట్టు జాయింట్ సిపి దాడి నాగేంద్రకుమార్ తెలిపారు.