ఆంధ్రప్రదేశ్‌

నంద్యాలలో మహిళల ప్రచారం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 16 : కర్నూలు జిల్లా నంద్యాల ఉపఎన్నికలో గెలుపు కోసం అధికార, ప్రతిపక్ష పార్టీలు మహిళలతో ప్రచారం చేయించడానికి వ్యూహం రచిస్తున్నాయి. విజయమే లక్ష్యంగా టిడిపి, వైకాపా పని చేస్తూ నియోజకవర్గంలో ఓటర్ల సానుభూతి కోసం ప్రయత్నాలు ముమ్మరం చేస్తున్నాయి. ప్రధానంగా నియోజకవర్గంలోని ఓటర్లను ప్రసన్నం చేసుకోవడానికి వైకాపా తరఫున పార్టీ గౌరవాధ్యక్షురాలు వైఎస్ విజయమ్మ, ఆమె కుమార్తె షర్మిల, పార్టీ అధినేత జగన్ భార్య భారతిచే ఒకసారైనా నియోజకవర్గంలో ప్రచారం చేయించాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది. అలాగే పార్టీ తరఫున సినీ నటి, ఎమ్మెల్యే రోజాతో పాటు వాగ్ధాటి ఉన్న మహిళా నాయకురాళ్లను నంద్యాలలో మకాం వేయించి పార్టీ ప్రచారంలో పాల్గొనేలా చేయాలని ఆలోచిస్తున్నట్లు తెలుస్తోంది. ప్రధానంగా విజయమ్మను రెండు దఫాలైనా ప్రచారంలో పాల్గొనేలా కార్యక్రమం సిద్ధం చేయాలని పార్టీ నేతలకు వైఎస్ జగన్ సూచించినట్లు తెలుస్తోంది. నియోజకవర్గంలోని ప్రధాన కేంద్రాల్లో విజయమ్మ ప్రచారం ఉంటుందని పార్టీ నాయకులు వెల్లడిస్తున్నారు. వారికి తోడుగా శిల్పా మోహనరెడ్డి కుటుంబంలోని పలువురు మహిళలు సైతం ప్రచారంలో పాల్గొననున్నట్లు తెలుస్తోంది. పార్టీ నుంచి ఎన్నికైన జిల్లాలోని పాణ్యం నియోజకవర్గం ఎమ్మెల్యే గౌరు చరిత, కర్నూలు ఎంపి బుట్టా రేణుక కూడా ప్రచారం చేయడానికి సిద్ధంగా ఉన్నారు. మరోవైపు తెలుగుదేశం పార్టీ తరఫున సైతం మహిళలను ప్రచారం చేసే దిశలో ముందడుగు వేస్తూ భూమా కుటుంబ సభ్యులందరినీ రంగంలోకి దించనున్నట్లు తెలుస్తోంది. కుమారునికి మద్దతుగా దివంగత భూమా శేఖర్‌రెడ్డి భార్య, అభ్యర్థి భూమా బ్రహ్మానందరెడ్డి భార్య రానున్న రెండు, మూడు రోజుల్లో ప్రచార కార్యక్రమంలో పాల్గొంటారని పార్టీ నేతల ద్వారా తెలుస్తోంది. దివంగత భూమా నాగిరెడ్డి చిన్న కుమార్తె నాగ వౌనిక కూడా ప్రచార కార్యక్రమంలో పాల్గొనడానికి ఏర్పాట్లు చేస్తున్నారని సమాచారం. ఇక పార్టీ తరఫున మహిళా మంత్రులు, ఎంపిలు ఒకసారైనా ప్రచారంలో పాల్గొని వైకాపా తీరును ఎండగట్టాలని పార్టీ అధినేత ఇప్పటికే సూచించినట్లు సమాచారం. పొరుగు జిల్లాకు చెందిన మంత్రి పరిటాల సునీత, మహిళా కమిషన్ చైర్‌పర్సన్ నన్నపనేని రాజకుమారిలతో పాటు ఇతర నాయకురాళ్లు కూడా ప్రచారం కోసం ఎక్కువ కాలం నంద్యాలలో ఉండేలా పార్టీ ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలుస్తోంది. మహిళలు ప్రచారంలో పాల్గొని తాము చెప్పదల్చుకున్నది చెప్తే ఓటర్ల సానుభూతి పొందవచ్చని ఇరు పార్టీలు భావిస్తున్నాయి. మరి వీరి భావనను ఓటర్లు ఎలా అర్థం చేసుకుంటారో వేచిచూడాలి.