ఆంధ్రప్రదేశ్‌

వైకాపాను వీడే ప్రసక్తే లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కర్నూలు, జూలై 16 : తాను వైఎస్‌ఆర్ కాంగ్రెస్ పార్టీని వీడుతున్నట్లు వస్తున్న వార్తలు నిరాధారమని, ఎట్టి పరిస్థితుల్లో వైకాపాను వీడే ప్రసక్తే లేదని కర్నూలు ఎంపి బుట్టా రేణుక ఆదివారం స్పష్టం చేశారు. ఎంపి రేణుక ఆదివారం కర్నూలులో విలేఖరులతో మాట్లాడుతూ తన పార్లమెంటు నియోజకవర్గం పరిధిలోని గ్రామీణ సమస్యల పరిష్కారానికై పంచాయతీరాజ్ శాఖ మంత్రి నారా లోకేష్‌ను కలిశానే కానీ ఎలాంటి రాజకీయ ఉద్దేశ్యాలు లేవని వివరించారు. ఇక పార్టీ పార్లమెంటరీ సమావేశానికి రాలేనని ముందుగానే సమాచారం పంపానని ఆమె వెల్లడించారు. నియోజకవర్గంలోని టిడిపి కార్యకర్తలు వైకాపాలో చేరుతున్నందున తాను పార్లమెంటరీ పార్టీ సమావేశానికి రాలేనని తెలిపినట్లు పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కూడా వైకాపా నుంచే పోటీ చేస్తానని ఆమె తెలిపారు. తాను పార్టీ మారుతున్నట్లు వచ్చిన వార్తలు మీడియా సృష్టేనన్నారు. రాబోయే ఎన్నికల్లో వైకాపాదే విజయమని ధీమా వ్యక్తం చేశారు. అనంతరం ఆమె పార్టీ అధినేత జగన్‌ను కలవడానికి బయల్దేరి వెళ్లారు.