ఆంధ్రప్రదేశ్‌

రూ.450 కోట్లతో ‘బాలామృతం’

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

తెనాలి, జూలై 16: రాష్ట్ర ప్రభుత్వం ముఖ్యమంత్రి చంద్రబాబు ఆశీస్సులతో ఆగస్టు 1 నుండి 450 కోట్ల రూపాయల నిధులతో ‘బాలామృతం’ పథకం రాష్టవ్య్రాప్తంగా అమలు చేయనుందని స్ర్తి, శిశు సంక్షేమ శాఖ మంత్రి పరిటాల సునీత చెప్పారు. అంగన్‌వాడీ కేంద్రాల్లోని బాలలకు పౌష్ఠికాహారం అందించి వారి ఆరోగ్యమే ధ్యేయంగా ఈ పథకం అమలు చేస్తామని తెలిపారు. గుంటూరు జిల్లా తెనాలిలో ఆదివారం జరిగిన టిడిపి కార్యకర్తల సమావేశంలో ఆమె మాట్లాడుతూ వైసిపి ప్లీనరీలో ప్రకటించిన నవరత్నాల ప్రభావం రుణమాఫీపై లేనేలేదనే విషయాన్ని ప్రజలు గ్రహించాలని కోరారు. రాష్ట్ర ప్రజల సంక్షేమం కోసమే ప్రభుత్వం, నాయకులు పనిచేస్తున్నారని ఆమె అన్నారు. డ్వాక్రా గ్రూపుల మహిళలకు 1200 కోట్ల రూపాయలు రుణమాఫీ కింద చెల్లించాల్సి ఉందని, 3వ విడతగా ఒక్కొక్కరికి మరో 4వేల రూపాయలను త్వరలోనే రాష్ట్ర ప్రభుత్వం చెల్లించనుందని తెలిపారు. సంవత్సరానికి 6వేల కోట్ల రూపాయల మేరకు పింఛన్లు పంపిణీ చేస్తున్నామని, కులానికో కార్పొరేషన్ ఏర్పాటు చేసి అన్ని వర్గాల ప్రజలకు న్యాయం చేస్తున్న ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుకు ప్రజలంతా సహకరించాలని కోరారు. పార్టీ నాయకులు, కార్యకర్తలు ఆయన ఆశయాల సాధన కోసం ప్రాణత్యాగానికైనా సిద్ధంగా ఉండాలని, అందుకు పరిటాల రవిని ఆదర్శంగా తీసుకోవాలని మంత్రి సునీత సూచించారు. సమావేశంలో రాష్ట్ర సాంఘిక, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి నక్కా ఆనందబాబు, పార్టీ నాయకులు పాల్గొన్నారు.