ఆంధ్రప్రదేశ్‌

ఇంద్రకీలాద్రికి మావుళ్ళమ్మ అమ్మవారి సారె

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 16: విజయవాడ ఇంద్రకీలాద్రి పై వేంచేసియున్న కనకదుర్గమ్మ అమ్మవారికి భీమవరం ఇలవేల్పు మావుళ్ళమ్మ అమ్మవారి దేవస్థానం నుండి ఆదివారం చీర, సారె పంపించారు. ఆషాఢమాసం సాంప్రదాయాన్ని పాటిస్తూ పసుపు, కుంకుమ, చీర, గాజులు, 11 రకాల మిఠాయిలను పంపించారు. ఉదయం అమ్మవారికి పూజలు నిర్వహించిన అనంతరం ఆలయ అసిస్టెంట్ కమిషనర్ నల్లం సూర్యచక్రధరరావు పసుపు, కుంకుమ, పట్టుచీర, గాజులు, పండ్లు, 11 రకాల మిఠాయిలతో కూడిన సారెను విజయవాడ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయ కార్యనిర్వహణాధికారి సూర్యకుమారికి అందజేశారు. రాష్ట్ర చరిత్రలోనే తొలిసారిగా ఈ కార్యక్రమాన్ని నిర్వహిస్తున్నారు. అదే విధంగా రాష్ట్రంలో ఉన్న 101 గ్రామ దేవతల దేవస్థానాల నుంచి సారె తీసుకువెళతారు.
తెలంగాణ రాష్ట్రంలో ఆషాఢమాసంలో ప్రతిష్ఠాత్మకంగ జరిగే బోనాల పండుగ మాదిరిగా ఈ కార్యక్రమాన్ని ఆంధ్రప్రదేశ్‌లో కనకదుర్గమ్మ అమ్మవారి దేవస్ధానం నిర్వహిస్తోంది. అదే విధంగా రాష్ట్రంలో 13 జిల్లాల నుంచి అమ్మవారి భక్తులు, మొక్కులు తీర్చుకునే వారు ఆషాఢ మాసంలో అధిక సంఖ్యలో అమ్మవారిని దర్శించుకుని ఎవరికి వారు సారెను మావుళ్ళమ్మ అమ్మవారికి అందిస్తున్నారు. ఇప్పటికే రాష్ట్రంలోని అధిక సంఖ్యలో శక్తి ఆలయాల్లో ఆషాఢమాసం సందర్బంగా శాకాంబరి అలంకరణ చేసిన సంగతి తెలిసిందే.

చిత్రం.. మావుళ్ళమ్మ ఆలయంలో భక్తుల దర్శనార్ధం ఉంచిన చీర, సారె