ఆంధ్రప్రదేశ్‌

విదర్భ నీటిపారుదల సంస్థలో భారీ అక్రమాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఆత్మకూరు, జూలై 16: నెల్లూరు జిల్లా ఉదయగిరి నియోజకవర్గానికి చెందిన తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావుతో పాటు పలువురిపై మహారాష్టక్రు చెందిన నాగపూర్ ఏసిబి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఆదివారం ఒక్కసారిగా గుప్పుమన్న ఈ నేరారోపణలకు సంబంధించిన వివరాలిలా ఉన్నాయి. మహారాష్టల్రోని విదర్భ నీటిపారుదల అభివృద్ధి సంస్థ (విఐడిసి)లో భారీ కుంభకోణాలు జరిగినట్లు గత కొనే్నళ్ల నుంచి ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. ప్రస్తుతం ఆ రాష్ట్రానికి బిజెపి నేతృత్వంలోని దేవేంద్ర ఫడ్నవిస్ ముఖ్యమంత్రిగా కొనసాగుతున్నారు. ఈయన మహారాష్ట్ర సిఎం అయిన అనంతరం గత ప్రభుత్వంలో చోటుచేసుకున్న వివిధ కుంభకోణాలపై సమగ్రంగా విచారణ జరిపేందుకు పూనుకున్నారు. అందులో భాగంగా విదర్భ నీటిపారుదల అభివృద్ధి సంస్థలో చోటుచేసుకున్న కుంభకోణాలపై సమగ్ర దర్యాప్తు చేస్తుండటంతో బొల్లినేని వ్యవహారం బట్టబయలైంది. దీంతో విపక్షాలు ఒక్కసారిగా విమర్శలకు పదునుపెట్టాయి. విదర్భ మహారాష్టల్రోని చాలా వెనుకబడిన ప్రాంతం. దీంతో విదర్భ ప్రజానీకం తమ ప్రాంతాన్ని వేరు రాష్ట్రంగా విభజించాలని ఎన్నో ఏళ్లుగా డిమాండ్ చేస్తున్నారు. ఈక్రమంలో కేంద్ర ప్రభుత్వం భారీ ప్యాకేజీలతో విదర్భ ప్రాంత అభివృద్ధికి వరాలు గుప్పించింది. అలా ప్రకటించిన కోట్లాది రూపాయలతో జరుగుతున్న వివిధ అభివృద్ధి పనుల్లో భాగంగా గత ప్రభుత్వం అక్రమాలకు పాల్పడిందని ప్రస్తుత ముఖ్యమంత్రి ఫడ్నవిస్ భావించారు. నీటిపారుదల అభివృద్ధి సంస్థలో అవినీతి ప్రవహించిందనే అంశంపై కూపీలాగిన వైనంతో బొల్లినేని తతంగం కూడా బయల్పడింది. అక్కడి అధికార యంత్రాంగాన్ని మచ్చిక చేసుకుని ముందుగా అంచనాల్లోనే అధిక మొత్తాలు తేడా చూపించి భారీగా బొక్కేసినట్లు అభియోగాలున్నాయి. ఈ వ్యవహారం నెల్లూరు జిల్లాలో రాజకీయ దుమారం రేపింది.
అవినీతికి పాల్పడినట్లు నిరూపిస్తే
రాజకీయాలకు స్వస్తి చెబుతా..
నెల్లూరు: తాను మహారాష్టల్రో చేపట్టిన ఇరిగేషన్ పనుల్లో అవినీతికి పాల్పడినట్లు రుజువైతే తన ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేసి రాజకీయాలకు స్వస్తి పలుకుతానని ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు స్పష్టం చేశారు. ఆదివారం జిల్లా కేంద్రమైన నెల్లూరులో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ తాను భాగస్వామిగా ఉన్న శ్రీనివాస కన్‌స్ట్రక్షన్ కంపెనీకి చెందిన సుమారు రూ.800 కోట్ల రూపాయల పనులను మహారాష్ట్ర ప్రభుత్వం రద్దు చేసిందని, ఈ సంఘటనపై తమ కంపెనీ కోర్టుకు కూడా వెళ్లిందన్నారు. నాగపూర్‌లోని సంస్థ కార్యాలయంలో సమాచారం కోసం అక్కడి ఏసిబి అధికారులు కొన్ని పత్రాలు అడిగారని చెప్పారు. అంతే కానీ తనకు ఎటువంటి అరెస్ట్ వారెంట్, నోటీసులు ఇవ్వలేదన్నారు. కాంట్రాక్టర్లు రింగ్‌గా ఏర్పడ్డారనే ఆరోపణలపై మాత్రమే విచారణ జరుగుతోందన్నారు. మొత్తం 41 కంపెనీలకు చెందిన 81 పనులను రద్దు చేశారని గుర్తు చేశారు. తాము ఎటువంటి అవినీతికి పాల్పడలేదని, పైగా తాను సదరు కంపెనీని నుండి 2012లో తాను రాజకీయాల్లోకి ప్రవేశించే సమయంలో వైదొలగినట్లు స్పష్టం చేశారు. కొందరు కావాలనే తన రాజకీయ ఎదుగుదలను ఓర్వలేక తప్పుడు సమాచారం మీడియాకు చేరవేస్తున్నారని ఆరోపించారు. కోర్టులో కేసు వేశామని, కోర్టు తీర్పు ప్రకారం నడుచుకుంటామని, ఒకవేళ తాను తప్పు చేసినట్లు కోర్టు తీర్పు వెలువడితే ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తానని స్పష్టం చేశారు. 30 ఏళ్ల నుండి మహారాష్టల్రో కాంట్రాక్ట్ పనులు చేపడుతూ ఉత్తమ కాంట్రాక్టర్‌గా అక్కడి ప్రభుత్వం నుండి అవార్డు అందుకున్న ఘనత తనదన్నారు. తనపై అక్కడ ఎటువంటి అవినీతి ఆరోపణలు లేవని, కొందరు కావాలనే కుట్ర పన్నారని అనుమానం వ్యక్తం చేశారు.

చిత్రం.. ఉదయగిరి ఎమ్మెల్యే బొల్లినేని వెంకట రామారావు