ఆంధ్రప్రదేశ్‌

స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశానికి 19న ఎంపికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (స్పోర్ట్స్), జూలై 17: రాష్ట్రంలో త్వరలో ప్రారంభించనున్న ఏడు స్పోర్ట్స్ అకాడమీల్లో ప్రవేశానికి ఈనెల 19న విజయవాడ ఇందిరాగాంధీ మున్సిపల్ స్టేడియంలో సెలెక్షన్ ట్రయల్స్ నిర్వహిస్తున్నట్లు డిఎస్‌డివో బి.శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. 11 క్రీడాంశాల్లో నిర్వహిస్తున్న ఈ అకాడమీల్లో ప్రవేశానికి అర్హులైన ఆసక్తిగల క్రీడాకారులు హాజరుకావాలని కోరారు. క్రీడాంశాల్లో ప్రవేశం ఉండి 15 నుంచి 18 సంవత్సరాల వయసు గలవారై జాతీయస్థాయి, ఇంటర్ యూనివర్సిటీ, నేషనల్ స్కూల్ గేమ్స్, జాతీయ ఖేలో ఇండియా పోటీల్లో మొదటి ఎనిమిది స్థానాల్లో నిలిచిన వారు అర్హులు. వివరాలకు విజయవాడలోని జిల్లా క్రీడా ప్రాధికార సంస్థ కార్యాలయంలో సంప్రదించాలని కోరారు.