ఆంధ్రప్రదేశ్‌

‘నంద్యాల’కు ఇన్‌చార్జిలుగా 12 మంది ఎమ్మెల్యేలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: నంద్యాల ఉప ఎన్నికలో విజయం కోసం ముఖ్యమంత్రి, తెలుగుదేశం పార్టీ జాతీయ అధ్యక్షుడు చంద్రబాబు నాయుడు సంచలన నిర్ణయం తీసుకున్నారు. 12 మంది ఎమ్మెల్యేలను ఈ ఎన్నికకు ఇన్‌చార్జులుగా నియమించారు. రాష్టప్రతి ఎన్నిక సందర్భంగా ఓటింగ్ తరువాత సచివాలయంలో ఎమ్మెల్యేలతో సిఎం సమావేశమయ్యారు. నంద్యాల ఉప ఎన్నిక అనుసరించాల్సిన వ్యూహంపై దాదాపు గంట సేపు చర్చించారు. ఎన్నికలో గెలుపునకు ఎటువంటి వ్యూహం అనుసరించాలో దిశా నిర్దేశం చేశారు. ఇన్‌చార్జులుగా 12 మందిని నియమించారు. ఎమ్మెల్యేలు నిమ్మల రామానాయుడు, బొండా ఉమ, బోడే ప్రసాద్ తదితరులు ఉన్నారు.