ఆంధ్రప్రదేశ్‌

రోజాకు నోటీసులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: రాష్టప్రతి ఎన్నికల సందర్భంగా అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాదరావుపై వైకాపా ఎమ్మెల్యే రోజా చేసిన వ్యాఖ్యల నేపథ్యంలో ఆమెకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వనున్నారు. ఈ మేరకు అసెంబ్లీ సెక్రటరీకి స్పీకర్ ఆదేశాలు జారీ చేశారు. రాష్టప్రతి ఎన్నికల సందర్భంగా సోమవారం తన ఓటు హక్కును వినియోగించుకున్న అనంతరం, రోజా మీడియా పాయింట్ వద్ద మాట్లాడుతూ టిడిఎల్‌పిలో జరిగిన మాక్ పోలింగ్‌లో స్పీకర్ కూడా పాల్గొన్నారని ఆరోపించారు. క్యాబినెట్ సమావేశానికీ వెళ్లారని, టిడిపి కండువాలతో నియోజకవర్గాల్లో పర్యటిస్తున్నారని ఆరోపించారు. తన పదవికి గౌరవంగా ఉండేలా స్పీకర్ ప్రవర్తిస్తే బాగుంటుందని సూచించారు. దిగజారి స్పీకర్ పదవికి గౌరవం లేకుండా చేయడమనేది ఆయన విజ్జతకే వదిలి వేస్తున్నట్లు తెలిపారు. దీనిపై స్పీకర్ కోడెల శివప్రసాదరావు స్పందిస్తూ, స్పీకర్‌గా ఎన్నికయ్యాక తాను టిడిఎల్‌పి కార్యాలయానికి వెళ్లలేదని, ఓటు ఏలా వేయాలో తనకు, సిఎంకు తన కార్యాలయం ఎదుటే తనకు అధికారులు సూచించారన్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు కూడా తన వద్దకు వచ్చి పనులు చేయించుకుంటున్నారని తెలిపారు. తాను స్పీకర్ స్థానాన్ని కించపరిచేలా ఎక్కడా వ్యవహరించలేదని, స్పీకర్ పదవికి వనె్న తెచ్చేలా కృషి చేస్తున్నానని తెలిపారు. నియోజకవర్గాల్లో అభివృద్ధి కార్యక్రమాల్లో చురుగ్గా పాల్గొంటున్నానని, తనకు అందరూ సమానమేనని తెలిపారు. ఒకరిని ఎక్కువగా, మరొకరిని తక్కువగా ఎప్పుడూ చూడలేదని స్పష్టం చేశారు. టిడిఎల్‌పి కార్యాలయానికి వెళ్లినట్టు రోజా చేసిన ఆరోపణలపై ఆమెకు ప్రివిలేజ్ నోటీసులు ఇవ్వాలని ఆదేశించారు.