ఆంధ్రప్రదేశ్‌

విజయవాడ మెట్రోపై త్వరలోనే తుది నిర్ణయం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: విజయవాడ మెట్రో రైల్ ప్రాజెక్టుపై మరో కొద్ది రోజుల్లోనే తుది నిర్ణయం తీసుకోనున్నట్లు పురపాలక శాఖ మంత్రి పి.నారాయణ తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. అమెరికా పర్యటనలో భాగంగా సిఎం చంద్రబాబునాయుడు అక్కడ ఎలక్ట్రికల్ బస్సులను పరిశీలించి, అమరావతిలోనూ వాటి నిర్వహణ సాధ్యసాధ్యాలపై పరిశీలన చేయమన్నారన్నారు. దీనిపై మలేషియా, చైనా దేశాల్లో పర్యటించి, ఎలక్ట్రికల్, మోనో, మేగ్నటిక్, లైట్ మెట్రో, హెవీ మెట్రో రైళ్ల పనితీరును పరిశీలించామన్నారు. వాటి నిర్వహణా తీరును సిఎం చంద్రబాబునాయుడుకు వివరించామన్నారు. ప్రస్తుతం విజయవాడలో గంటకు పలు వాహనాలపై 6,400 మంది ప్రయాణిస్తున్నారన్నారు. లైట్ మెట్రో రైల్ (ఎల్‌ఆర్‌టి) నడపాలంటే గంటకు 40 వేల మంది, హెవీ మెట్రో రైల్ నిర్వహణకు 80వేల మంది ప్రయాణించాల్సి ఉంటుందన్నారు. ప్రస్తుతం విజయవాడలో 12 లక్షల జనాభా ఉందన్నారు. వాహనాల ద్వారా విజయవాడలో గంటకు 40 వేల జనాభా ప్రయాణాలు సాగించాలంటే, 50 నుంచి 70 ఏళ్లు పట్టే అవకాశముందని మంత్రి నారాయణ తెలిపారు. ఎలక్ట్రికల్ బస్సుల నిర్వహణ ఖర్చుతో కూడుకుందన్నారు. రాష్ట్రంలో ఏ రకమైన రైల్ వ్యవస్థ నిర్వహణ బాగుంటుందో అనే దానిపై జర్మనీకి చెందిన కన్సల్టెన్సీ సంస్థ పరిశీలన జరుపుతుందన్నారు. లైట్ మెట్రో కంటే హెవీ మెట్రో నిర్వహణ వ్యయంతో కూడుకున్నదన్నారు. హెవీ మెట్రో కంటే ఎల్‌ఆర్‌టి పెట్టుబడిలో 15 శాతం తక్కువగా వ్యయమవుతుందన్నారు. ఏది మంచిది అనే దానిపై జర్మనీకి చెందిన కన్సల్టెంట్ సంస్థ 15 రోజుల్లో సిఎం చంద్రబాబుకు నివేదిక అందజేస్తుందన్నారు. దీనిపై పరిశీలన జరిపి, మెట్రో రైల్‌పై 20,25 రోజుల్లో తుది నిర్ణయం తీసుకుంటామని మంత్రి నారాయణ వెల్లడించారు. విజయవాడ, గుంటూరు, తెనాలి, మంగళగిరి ప్రాంతాలను కలుపుతూ 110 కిలో మీటర్లలో సర్క్యూట్ రైళ్లను నడిపే ఆలోచన కూడా ఉందన్నారు. ఈ సమావేశంలో అమరావతి మెట్రో రైల్ కార్పొరేషన్ ఎండి రామకృష్ణారెడ్డి పాల్గొన్నారు.