ఆంధ్రప్రదేశ్‌

తప్పులో కాలేశారు!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: వాళ్లు చట్టాలు చేసే సభలో గౌరవనీయ సభ్యులు. కానీ ఓటు వేయడం కూడా తెలియలేదు. పైగా ఓటు ఎలా వేయాలో ఆపసోపాలు పడి చెప్పినా వారి చెవికెక్కలేదు. ఫలితంగా రెండు అమూల్యమైన ఓట్లు చెల్లకుండా పోయాయి. రాష్టప్రతి ఎన్నికలో తెలుగుదేశం పార్టీకి చెందిన ఇద్దరు శాసనసభ్యుల తీరిది. సోమవారం జరిగిన రాష్టప్రతి ఎన్నికలో, ఓటు వేసే ఎమ్మెల్యేలకు ఓటుహక్కు వినియోగంపై అవగాహన కోసం ఉదయమే మాక్ పోలింగ్ నిర్వహించారు. ముందు డమీ బ్యాలెట్‌పై పేర్లు రాసి ఇవ్వమని చెప్పారు. ఆ తర్వాత జరిగే అసలు పోలింగ్‌లో అంకె వేయాలని స్వయంగా బాబు సూచించారు. అందరూ బాబు సూచనలు పాటించారు. కానీ ప్రకాశం జిల్లా కనిగిరి ఎమ్మెల్యే కదిరి బాబూరావు, అనంతపురం జిల్లా గుంతకల్ ఎమ్మెల్యే జితేంద్ర గౌడ్ మాత్రం కమిటీ హాల్‌లోని పోలింగ్ కేంద్రంలో కూడా మాక్ పోలింగ్‌లో చేసినట్లుగానే పేర్లు రాశారు. దీనితో వారి ఓట్లు చెల్లకుండా పోయాయని టిడిపిఎల్‌పి కార్యాలయంలో ఉన్న ఎమ్మెల్యేలు ఆందోళన చెందారు. ఇది తెలిసిన చంద్రబాబునాయుడు వారిపై ఆగ్రహం వ్యక్తం చేసినట్లు సమాచారం. ‘మీకు మాక్ పోలింగ్ పెట్టి ఎలా ఓటు వేయాలో చెప్పినా అర్థం కాకపోతే ఎలా?’ అని ఆగ్రహం వ్యక్తం చేయగా, మీరు చెప్పినట్లే చేశామని బాబూరావు చెప్పడంతో బాబు బిత్తరపోయారు. అయితే, చెప్పాల్సిన దానికంటే ఎక్కువ చెప్పడం వల్లే ఇది జరిగిందని కొందరు ఎమ్మెల్యేలు వ్యాఖ్యానించారు. బాబూరావుకు సంబంధించి గతంలో ఎదురైన ఇలాంటి అనుభవాలు గ్రహించిన గురజాల ఎమ్మెల్యే యరపతనేని శ్రీనివాసరావు స్వయంగా బాబూరావు వద్దకు వెళ్లి ఓటు ఎలా వేయాలో చెప్పినప్పటికీ, బాబూరావు తప్పులోకాలేయడం చర్చనీయాంశమయింది. అయితే దీనిని శ్రీకాకుళం జిల్లాకు చెందిన ఓ మంత్రి పెద్ద సమస్యగా మార్చేందుకు ప్రయత్నించగా, టిడిపిఎల్పీ కార్యాలయం తప్పేమీ లేదని, వారి మార్గదర్శకాలు సక్రమంగానే ఉన్నప్పటికీ ఇద్దరు ఎమ్మెల్యేల అవగాహనారాహిత్యంతోనే పొరపాటు జరిగిందని తేల్చారు.