ఆంధ్రప్రదేశ్‌

‘పర్యాటక’ బహుమతి ప్రతిమలు, జ్ఞాపికలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 17: ఇకపై పర్యాటక శాఖ సమీకరించే బహుమతి ప్రతిమలు, జ్ఞాపికలను కేవలం లేపాక్షి సంస్థ నుండి మాత్రమే తీసుకోవాలని పర్యాటక, సాంస్కృతిక శాఖ కార్యదర్శి ముఖేష్ కుమార్ మీనా నిర్ణయించారు. సోమవారం ఎపిటిడిసి ఎండి హిమాన్షు శుక్లాతో కలిసి ప్రభుత్వ పరంగా అందించవలసిన జ్ఞాపికలు ఎలా ఉండాలన్న దానిపై మీనా చర్చించారు. లేపాక్షి అందించే విభిన్న ప్రతిమలు, జ్ఞాపికలను సచివాలయంలో ప్రదర్శనకు ఉంచగా సంస్థ జనరల్ మేనేజర్ ఐవి లక్ష్మీనాథ్ వాటి గురించి వివరించారు. వీటిని పరిశీలించిన మీనా నేత కార్మికులు, చేతివృత్తి దారులకు మేలు జరిగేలా అందుబాటులో ఉన్న అన్ని రకాల ఉత్పత్తులను లేపాక్షి నుండి మాత్రమే కొనుగోలు చేయాలని ఎపి టిడిసి ఎండి శుక్లాను ఆదేశించారు.