ఆంధ్రప్రదేశ్‌

మళ్లీ పవన్‌ను తీసుకొద్దాం!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 18: క్రియాశీల రాజకీయాల నుంచి వైదొలగి, త్వరలో ఉప రాష్టప్రతి పదవి చేపట్టేందుకు సిద్ధమవుతున్న వెంకయ్యనాయుడు రాజకీయ నిష్క్రమణ రాష్ట్ర రాజకీయాల్లో కొత్త సమీకరణలకు తెరలేపే అవకాశాలు కనిపిస్తున్నాయి. అందులో భాగంగా జనసేన అధిపతి పవన్ కల్యాణ్‌ను తిరిగి ఎన్డీఏ వైపు అడుగులు వేయించేందుకు బిజెపిలోని ఒక వర్గం ప్రయత్నాలు ప్రారంభించింది. గత ఎన్నికల్లో ఎన్డీఏకు మద్దతుగా ప్రచారం చేసిన పవన్ కల్యాణ్ తర్వాత జరిగిన పరిణామాల్లో వెంకయ్యనాయుడును లక్ష్యంగా చేసుకుని అనేకసార్లు విమర్శనాస్త్రాలు సంధించిన విషయం తెలిసిందే. ఒకదశలో ఆయన వల్లే పవన్ బిజెపికి దూరమయ్యారన్న ప్రచారం కూడా జరిగిన విషయాన్ని పార్టీ వర్గాలు గుర్తు చేస్తున్నాయి. తాజాగా వెంకయ్య క్రియాశీల రాజకీయాల నుంచి నిష్క్రమించినందున, పవన్‌ను తిరిగి బిజెపి వైపు అడుగులు వేయించడం ద్వారా, రాష్ట్రంలో ఎన్డీఏను పటిష్టం చేయాలని బిజెపిలోని వెంకయ్య వ్యతిరేక వర్గం అప్పుడే ప్రయత్నాలు ప్రారంభించినట్లు సమాచారం. ఆ మేరకు వారు త్వరలో పవన్ కల్యాణ్‌ను కలసి ఎన్డీఏతో తిరిగి పనిచేయాలని కోరేందుకు సిద్ధమవుతున్నట్లు పార్టీ వర్గాల సమాచారం. ఆ మేరకు పవన్ కల్యాణ్‌ను కలసి, తమ అభ్యర్ధనను ఆయన ముందు ఉంచాలని యోచిస్తున్నట్లు తెలిసింది. పవన్ కల్యాణ్ ఎన్డీఏతో తిరిగి జతకడితే రాష్ట్రంలో నిర్ణయాత్మక శక్తిగా ఉన్న కాపు వర్గాలు ఎన్డీఏ వైపు మొగ్గుచూపుతాయని, దానికితోడు బిజెపిలోని కాపు నేతకు రాష్ట్ర అధ్యక్ష పదవి పగ్గాలిస్తే.. కోస్తాలోని కాపు, రాయలసీమలోని బలిజ వర్గాలు మూకుమ్మడిగా పార్టీ వైపు మొగ్గుచూపుతారన్న అంచనా బిజెపి వర్గాల్లో వ్యక్తమవుతోంది.