ఆంధ్రప్రదేశ్‌

మోదీ విదేశీ పర్యటనతో సామాన్యులకు ఒరిగేదేమీ లేదు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

ఒంగోలు, జూలై 17: ప్రధాని నరేంద్ర మోదీ విదేశీ పర్యటనల వలన దేశానికి , సామాన్యులకు పెద్దగా ప్రయోజనం లేదని సిపిఐ జాతీయ కార్యదర్శి కె నారాయణ ధ్వజమెత్తారు. సోమవారం ఒంగోలులోని సిపిఐ జిల్లా కార్యాలయంలోని సమావేశ మందిరంలో సిపిఐ రాష్టస్రమితి సమావేశాలు ప్రారంభమయ్యాయి. ఈసమావేశానికి విచ్చేసిన నారాయణ విలేఖర్లతో మాట్లాడుతూ మోదీ అధికారంలోకి వచ్చిననాటి నుండి నేటివరకు విదేశీపర్యటనలు ముమ్మరంగా చేస్తున్నారని దీనివలన దేశానికి ఎలాంటి ప్రయోజనం లేదని ధ్వజమెత్తారు. ఇటీవల జరిగిన అమెరికా పర్యటనలో యుద్ధ విమానాల కొనుగోలు ఒప్పందం వల్ల ఆ దేశం ఆర్థికంగా లాభం జరిగిందే తప్ప సామాన్యులకు ఎమీ లాభం కలగలేదన్నారు. బిజెపి దేశ అధ్యక్ష పదవిని సైతం కాషాయికరణ చేస్తోందని ఆరోపించారు.ఇదిలావుండగా కార్పొరేట్‌శక్తులకు జిఎస్‌టి అనుకూలంగా మారిందని నారాయణ ఆరోపించారు.జిఎస్‌టి రూపకల్పనలో అమెరికా పాలసీనే మోది అమలుచేసారని విమర్శించారు.