ఆంధ్రప్రదేశ్‌

పంచాయతీల్లో ఎల్‌ఇడి వెలుగులు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 17: రాష్ట్రంలోని పంచాయతీల్లో ఇక ఎల్‌ఇడి బల్బులను వినియోగించనున్నామని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ తెలిపారు. వెలగపూడి సచివాలయంలో పంచాయతీరాజ్ శాఖ, ఇఎస్‌ఎస్‌ఎల్ మధ్య సోమవారం ఒప్పందం జరిగింది. తొలిదశలో తొమ్మిది జిల్లాల్లోని పంచాయితీల్లో ఎల్‌ఇడి బల్బులు అమర్చేందుకు వీలుగా ఒప్పందం చేసుకున్నారు. ఈ సందర్భంగా సిఎస్ మాట్లాడుతూ, తొలిదశలో గంటూరు, ప్రకాశం, నెల్లూరు, రాయలసీమ జిల్లాల్లోని పంచాయితీల్లో ఎల్‌ఇడి బల్బులు అమర్చనున్నట్లు తెలిపారు. తొమ్మిది నెలల్లో దాదాపు 10 లక్షల ఎల్‌ఇడి బల్బులను అమర్చనున్నారన్నారు. ఆ సంస్థే 10 సంవత్సరాల పాటు నిర్వహిస్తుందని, దీని ద్వారా 111 మిలియన్ యూనిట్ల విద్యుత్ ఆదా అవుతుందన్నారు. 165 కోట్ల రూపాయల మేర విద్యుత్ బిల్లులు ఆదా అవుతాయన్నారు. ఆదా అయిన విద్యుత్ బిల్లుల్లో 20 శాతం పంచాయితీలకు ఇచ్చి, మిగిలిన మొత్తాన్ని ఆ సంస్థ తీసుకుంటుందని తెలిపారు. పైసా పెట్టుబడి లేకుండా పంచాయితీల్లో ఎల్‌ఇడి వెలుగులు చోటు చేసుకుంటాయన్నారు. రెండో దశలో మిగలిన జిల్లాల్లోని పంచాయితీల్లో చేపడతామన్నారు. ఆగస్టు 2018 నాటికి రాష్ట్రంలోని అన్ని పంచాయితీల్లో ఎల్‌ఇడి బల్బులు అమరుస్తామన్నారు. పాతబడిన మంచినీటి సరఫరా మోటార్లను కూడా మార్చాలని ఆదేశించారు. ఈ సమావేశంలో పంచాయితీరాజ్ శాఖ స్పెషల్ చీఫ్ సెక్రటరీ జవహర్‌రెడ్డి, కమిషనర్ రామాంజనేయులు తదితరులు పాల్గొన్నారు.