ఆంధ్రప్రదేశ్‌

500 హెక్టార్లలో పంటలకు నష్టం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయనగరం, జూలై 17: నాగావళి ఉద్ధృతి తగ్గుముఖం పట్టింది. గత మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు నాగావళి ఉగ్రరూపం దాల్చడంతో కొమరాడ, జియ్యమ్మవలస, గరుగుబిల్లి మండలాలకు చెందిన ప్రజలు ఆందోళనకు గురైన విషయం విదితమే. కొమరాడలోని పలు పంచాయతీలు జలదిగ్భందంలో చిక్కుకున్నాయి. వరద పరిస్థితిని అంచనా వేసేందుకు కలెక్టర్ వివేక్‌యాదవ్ సోమవారం కొమరాడ, జియ్యమ్మవలస మండలాల్లో పర్యటించారు. కొమరాడ మండలం కూనేరు వద్ద దెబ్బతిన్న పార్వతీపురం-రాయగఢ రోడ్డును, కూనేరులో వర్షానికి దెబ్బతిన్న ఇళ్లను పరిశీలించారు. ఈ మూడు మండలాల్లో దాదాపు 500 హెక్టార్లలో వరి, చెరకు, పత్తి, మొక్కజొన్న పంటలకు నష్టం వాటిల్లిందని ప్రాథమిక అంచనా వేశారు. జియ్యమ్మవలస మండలం బాసంగి గ్రామస్థులు తమకు పక్కా ఇళ్లు నిర్మించుకునేందుకు పునరావాసం కింద నిధులు మంజూరు చేయాలని కలెక్టర్‌ను వేడుకున్నారు.

చిత్రం.. వరద ఉద్ధృతికి దెబ్బతిన్న రాయగడ-పార్వతీపురం రోడ్డు