ఆంధ్రప్రదేశ్‌

గోదావరి జిల్లాలకు ముప్పు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 17: భారీ వర్షాల కారణంగా ఉభయ గోదావరి జిల్లాలకు రానున్న పక్షం రోజుల్లో వరదలు సంభవించే అవకాశమున్నట్టు సమాచారం రావడంతో అధికారులు అప్రమత్తమయ్యారు. వాతావరణ శాఖాధికారుల హెచ్చరికల ప్రభుత్వ యంత్రాంగం ముందు జాగ్రత్త చర్యలకు సన్నద్ధమయ్యింది. భారీ వర్షాల నేపథ్యంలో ఉభయ గోదావరి జిల్లాల్లోని ఏజన్సీ ప్రాంతాలు, గోదావరి ఎగువ పరీవాహక ప్రాంతంలో మెరుపు వరదలకు ఆస్కారం ఉండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. ఆయా ప్రాంతాల్లో నష్ట నివారణ చర్యలు చేపట్టేందుకు తక్షణం చర్యలు తీసుకోవల్సిందిగా ప్రభుత్వం అధికారులను ఆదేశించింది. దీంతో యుద్ధప్రాతిపదికన సహాయక చర్యలకు సంబంధించి కార్యాచరణ ప్రణాళికలను అధికారులు సిద్ధం చేస్తున్నారు. భారీ వర్షాల కారణంగా వరదలు సంభవిస్తే ప్రాణ, ఆస్తి నష్టాల నివారణకు, వైపరీత్యాలను సమర్ధవంతంగా ఎదుర్కొనేందుకు సమాయత్తం కావాలంటూ ప్రభుత్వం స్పష్టం చేసింది. అలాగే గోదావరి నదికి ఏటా జూలై, ఆగస్టు నెలల్లో వచ్చే వరదలను దృష్టిలో ఉంచుకుని, గత అనుభవాల ఆధారంగా ఉభయ గోదావరి జిల్లాల ప్రజలను అప్రమత్తం చేసే దిశగా అధికారులు కసరత్తు ప్రారంభించారు. నదీ పరివాహక ప్రాంతాలు, లోతట్టు ప్రాంతాల, తీర ప్రాంత మండలాల్లో విపత్తుల నియంత్రణకు అవసరమైన అన్ని రకాల చర్యలను చేపట్టేందుకు చర్యలు చేపట్టారు. రెండు, మూడు హెచ్చరికల స్థాయిలో ముంపు ప్రాంతాల ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అవసరమైన సహాయ పునరావాస కేంద్రాలను తక్షణం ఆర్డీవోలు, తహసీల్దార్లు సందర్శించేలా ఆదేశాలు జారీ అయ్యాయి. ఆయా పునరావాస కేంద్రాలకు తాగునీరు, కిరోసిన్, ఆహారం వంటివి తరలించేందుకు అవసరమైన ప్రణాళికలను సిద్ధం చేసే పనిలో ఉన్నారు. అలాగే ప్రజలను తరలించేందుకు వాహనాలను గుర్తించాలని, ఏజన్సీ ప్రాంతాల్లో మెరుపు వరదలకు ఆస్కారం ఉన్న గ్రామాలను గుర్తించి, ముందుజాగ్రత్త చర్యలు తీసుకోవాలని మండలాల అధికారులను తూర్పు గోదావరి జిల్లా కలెక్టర్ కార్తికేయ మిశ్రా ఆదేశించారు. పునరావాస కేంద్రాల వద్ద జంగిల్ క్లియరెన్స్ చేపట్టి, మరుగుదొడ్లు నిర్మించి, దుప్పట్లు, ఇతర వస్త్ర, వస్తు సామగ్రి అందుబాటులో ఉండేలా ఏర్పాట్లు చేయాలని ఆదేశించారు. గోదావరి లంకల్లో నివాసం ఉంటున్న మత్స్యకారులందరినీ గుర్తించి, వారిని సురక్షిత ప్రాంతాలకు తరలించాలని నిర్ణయించారు. అలాగే గజ ఈతగాళ్ల వివరాలను సేకరించి, వారు అందుబాటులో ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు. అన్ని తహసీల్దారు కార్యాలయాల్లోను వైర్‌లెస్ సెట్లు, తుపాను సహాయ చర్యల్లో వినియోగించే పరికరాలను పనిచేసే స్థితిలో ఉండేలా జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులను ప్రభుత్వం ఆదేశించింది.
పొంగి ప్రవహిస్తున్న వాగులు, వంకలు
విఆర్ పురం: కాగా గత నాలుగు రోజులుగా కురుస్తున్న వర్షాలకు విఆర్‌పురం మండలంలోని వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మండలంలోని దారపల్లి, తుష్టివారిగూడెం, తెల్లవారిగూడెం, కుందులూరు, మారేడిపూడి, అన్నవరం, తదితర గ్రామాల వద్ద గల వాగులు, వంకలు పొంగి ప్రవహిస్తున్నాయి. మొద్దులగూడెం చెరువు వద్ద కురుస్తున్న వర్షాలకు చెరువు పూర్తిగా నిండి, అలుగుల నుంచి వర్షపు నీరు వరదలా పొంగి ప్రవహిస్తున్నాయి. నిన్న మొన్నటి వరకూ చుక్కనీరులేని అన్నవరం వాగు ఎగువ ప్రాంతంలో పడిన వర్షాలకు ఉద్ధృతంగా పొంగి ప్రవహిస్తోంది. గోదావరి, శబరి జీవ నదులు సైతం ఎగువ ప్రాంతాలలో కురిసిన వర్షాలకు నీరు ఎరుపు రంగుకు మారాయి. కొద్ది రోజుల క్రితం వరకు ఈ నదులు ఇసుక తినె్నలతో దర్శనమిచ్చాయి. ఇప్పుడు కాస్త వరదనీరు చేరటంతో జలకళ సంతరించుకుంది.

చిత్రం.. విఆర్‌పురం మండలంలో ఉద్ధృతంగా ప్రవహిస్తున్న మొద్దులగూడెం చెరువు