ఆంధ్రప్రదేశ్‌

దేవస్థాన పాలకమండలి సభ్యులకు ఇక శిక్షణ తప్పనిసరి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: రాష్ట్రంలోని వివిధ దేవాలయాల పాలకమండళ్ల సభ్యులుగా నియమితులయిన వారందరికీ శిక్షణ తప్పనిసరి చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. రాష్ట్రంలో 6ఎ దేవాలయాల సహా 24 వేల దేవాలయాలు ఉన్నాయి. ఈ దేవాలయాలకు చాలా సందర్భాలలో స్థానిక రాజకీయ నాయకులతో పాలకమండళ్లను ఏర్పాటు చేస్తున్నారు. పాలకమండలి సభ్యులకు దేవస్థాన సిబ్బందికి మధ్య వివిధ అంశాలపై తరచు ఘర్షణ నెలకొంటున్న వ్యవహారాలు ప్రభుత్వం దృష్టికి వచ్చాయి. ఇటీవల శ్రీకాకుళం జిల్లా నర్సన్నపేటలో హిందూ సాధు పరిషత్ సమావేశమై పాలకమండలి సభ్యులకు శిక్షణను తప్పనిసరి చేయాలని ప్రభుత్వానికి విజ్ఞప్తి చేసింది. ఈ నేపథ్యంలో పాలకమండలి సభ్యులకు శిక్షణ ఇచ్చేందుకు ప్రభుత్వం నిర్ణయించింది. కనకదుర్గ దేవస్థానం, శ్రీశైలం దేవస్థానం, తిరుమల తిరుపతి దేవస్థానాలు వివిధ దేవాలయ పాలకమండళ్ల సభ్యులకు శిక్షణ ఇవ్వనున్నారు. పాలకమండలి సభ్యులుగా నియమితులైన 15 రోజుల్లోగా శిక్షణ ఇచ్చేందుకు నిర్ణయించారు. విజయవాడ సీతానగరంలోని స్టేట్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెంపుల్ ఎడ్మినిస్ట్రేషన్, తిరుపతిలోని శే్వత ప్రాంగణాలను శిక్షణకు వేదికగా ఎంపిక చేసింది. దేవాలయాలకు సంబంధించిన అంశాలపై గరిష్టంగా మూడు రోజులపాటు శిక్షణ ఇవ్వనున్నారు. సనాతన ధర్మం, దేవాలయాల సంస్కృతి, ధర్మాదాయ చట్టం, ఆలయ పరిపాలనా నిబంధనలు, ట్రస్టీల బాధ్యతలు, పాత్ర, తదితర అంశాలపై శిక్షణ ఇవ్వనున్నారు.