ఆంధ్రప్రదేశ్‌

బిల్లులో హోదా ప్రస్తావనే లేదు: శివాజీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

గుంటూరు, మే 9: పార్లమెంట్‌లో రాష్ట్ర విభజన సమయంలో ప్రవేశపెట్టిన ఏ బిల్లులోనూ ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా ఇచ్చే విషయంపై ఎలాంటి ప్రస్తావన లేదని రాజ్యసభ మాజీ సభ్యుడు యలమంచలి శివాజీ అన్నారు. సోమవారం గుంటూరులోని తన నివాసంలో ఏర్పాటు చేసిన విలేఖర్ల సమావేశంలో ఆయన మాట్లాడుతూ రాష్ట్ర విభజనకు సహకరించిన ఆనాటి అధికార, ప్రతిపక్ష పార్టీలు ప్రస్తుతం ప్రత్యేక హోదాపై మాట్లాడటం హాస్యాస్పదమని విమర్శించారు. అన్ని పార్టీల వద్ద విభజనకు సంబంధించిన బిల్లు కాపీలు ఉన్నాయని, వాటిలో ఎక్కడ కూడా ప్రత్యేక హోదా అంశమే లేదన్నారు. లోక్‌సభలో మాట్లాడే ప్రతి మాటకూ చట్టబద్ధత ఉంటుందని, కేంద్ర మంత్రులు, పార్లమెంట్ సభ్యులు చెట్లకింద ఇష్టానుసారం మాట్లాడటం సమంజసం కాదని ఆయన హితవు పలికారు. ప్రత్యేక హోదాపై పార్లమెంట్‌లో ఒక మాట, బయట మరోమాట చెబుతూ ప్రజలను గందరగోళంలోకి నెట్టడం తప్ప ఒరిగేదేమీ లేదన్నారు.