ఆంధ్రప్రదేశ్‌

రూ.50 కోట్ల రుణాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: వాల్మీకి ఫెడరేషన్ ద్వారా రూ.50 కోట్ల రుణాలు అందజేయనున్నట్లు ఆ ఫెడరేషన్ చైర్మన్ బిటి నాయుడు తెలిపారు. వెలగపూడి సచివాలయంలోని నాలుగో బ్లాక్ పబ్లిసిటీ సెల్‌లో మంగళవారం నిర్వహించిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ స్వాతంత్య్రం వచ్చిన 70 ఏళ్ల కాలంలో ఏ ప్రభుత్వమూ వాల్మీకులను ఆదుకోలేదన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన హామీలకు కట్టుబడుతూ, సిఎం చంద్రబాబునాయుడు వాల్మీకుల అభివృద్ధికి చిత్తశుద్ధితో కృషి చేస్తున్నారన్నారు. ఫెడరేషన్ ఏర్పాటుచేసి నిధులు కేటాయించారన్నారు. గ్రూపులుగా ఏర్పడిన వాల్మీకులకు ఫెడరేషన్ ద్వారా 2017-18 ఆర్ధిక సంవత్సరంలో రూ.50 కోట్ల మేర రుణాలివ్వడానికి రాష్ట్ర ప్రభుత్వం ముందుకొచ్చిందన్నారు. వాటిలో రూ.25 కోట్లు సబ్సిడీగానూ, మిగిలిన రూ.25 కోట్లు బ్యాంకు రుణంగా అందజేయనుంది. ముందుగా 10 నుంచి 15 మంది గ్రూపుగా ఏర్పడి, సొసైటీ రిజిస్ట్రేషన్ చేసుకోవాలన్నారు. గ్రూపు అధ్యక్ష, కార్యదర్శుల పేరున బ్యాంకులో జాయింట్ అకౌంట్ ప్రారంభించాలన్నారు. రిజిస్ట్రరైన గ్రూపు సభ్యులు వెబ్‌సైట్ ద్వారా ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలన్నారు. వచ్చే నెల ఒకటో తేదీ నుంచి 15వ తేదీ వరకూ లబ్ధిదారులను ఎంపిక చేస్తారన్నారు. వాల్మీకులందరినీ ఎస్టీలుగా గుర్తించడానికి ప్రభుత్వం నిర్ణయించిందన్నారు. ఇందుకోసం ఏయూ ప్రొఫెసర్ సత్యపాల్ ఆధ్వర్యంలో ప్రభుత్వం సర్వే కూడా చేపట్టిందన్నారు. ఫెడరేషన్ ఎండి డాక్టర్ నాగభూషణ్ మాట్లాడుతూ వాల్మీకుల అభివృద్ధికి ప్రత్యేక ప్రణాళికలు రూపొందించాలని ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ సూచించారన్నారు. స్కిల్ డెవలప్‌మెంట్, సెక్యూరిటీ విభాగాల్లో శిక్షణ ఇచ్చి, వాల్మీకి యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలన్నారు.