ఆంధ్రప్రదేశ్‌

ఫరూఖ్, రామసుబ్బారెడ్డి గవర్నర్ కోటా ఎమ్మెల్సీలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 18: నంద్యాలకు చెందిన మాజీ మంత్రి ఎన్.ఎం.డి ఫరూఖ్, కడప జిల్లా జమ్మలమడుగుకు చెందిన మాజీ మంత్రి పి.రామసుబ్బారెడ్డిని గవర్నర్ కోటాలో శాసనమండలికి సిఫార్సు చేస్తూ రాష్ట్ర మంత్రమండలి తీర్మానించింది. ఆ మేరకు తీర్మానాన్ని గవర్నరుకు పంపింది. నంద్యాల ఉప ఎన్నిక నోటిఫికేషన్‌లోపు వారిద్దరినీ మండలికి పంపించాలన్నది ప్రభుత్వ లక్ష్యంగా కనిపించింది. ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు అధ్యక్షతన మంగళవారం జరిగిన రాష్ట్ర మంత్రిమండలి సమావేశంలో శ్రీకాకుళం జిల్లా ఉద్దానంతోపాటు, ప్రకాశం జిల్లాలోని కనిగిరిలోని కిడ్నీవ్యాధి రోగులు, ఇసుక అక్రమ రవాణా నివారణ, బెల్టుషాపుల తొలగింపు అంశంపైనే ఎక్కువసేపు చర్చ జరిగినట్లు తెలిసింది. ఉద్దానం, కనిగిరి లోని కిడ్నీ బాధితులను ఆదుకునేందుకు ప్రభుత్వం చిత్తశుద్ధితో ఉందని, దానికి సంబంధించి ఇప్పటికే తెప్పించుకున్న నివేదికలను తక్షణం అమలుచేయాలని బాబు ఆదేశించారు. ప్రస్తుతం అక్కడ 7 ఆర్వో ప్లాంట్లు పనిచేస్తున్నాయని, వాటితోపాటు ఎన్ని అవసరమైతే అన్ని ఆర్వోప్లాంటు పెట్టేందుకు వెనుకాడవద్దని ఆదేశించారు. ‘మనం కిడ్నీ బాధితుల పక్షాన ఉన్నాం. వారికి ఊరట కల్పించడంతోపాటు ఆర్ధికంగా స్వాంతన కల్పించాల్సిన అవసరం కూడా మనపై ఉంది. దీనిని రాజకీయ కోణంలో కూడా మన బాధ్యతగా చూడాల’న్నారు. బెల్ట్‌షాపులు ఇక కనిపించకుండా చూడాల్సిన బాధ్యత పోలీసు-ఎక్సైజ్ శాఖలదేనన్నారు. వాటిని టిడిపి నేతలు నిర్వహిస్తున్నా ఉపేక్షించకూడదని, మన ఎన్నికల హామీని అమలుచేయాల్సిన బాధ్యత ఉందన్నారు. అయితే ఓ మంత్రి రెండురోజుల గడువు ఇస్తే బాగుంటుదని సూచించగా, బాబు ఆగ్రహం వ్యక్తం చేసినట్లు తెలిసింది. అది ఇల్లీగల్. దానికి గడువిచ్చేదేమిటి? తక్షణం తొలగించాల్సిందేనని స్పష్టం చేశారు. ఇసుక ఉచితంగా ఇస్తూ ఆదాయం పోగొట్టుకుంటున్నప్పటికీ, ధరలు తగ్గలేదన్న సర్వే నివేదికలపై సమావేశంలో చర్చించారు. ఇసుక మాఫియా నడుస్తోందని 10 శాతం మంది, తగ్గిందని 48 శాతం మంది అభిప్రాయపడ్డారని బాబు వివరించారు. ఈ సందర్భంగా రేవుకు ఒక అధికారిని నియమిస్తే బాగుంటుందని సూచించగా బాబు దానిని తిరస్కరించారు. ఆ బురద మనకెందుకు? ఫోర్‌మెన్ కమిటీ చూస్తుందని వ్యాఖ్యానించారు. ఇసుక వల్ల ప్రభుత్వానికి చెడ్డపేరు రాకూడదని స్పష్టం చేశారు. జిల్లా, నియోజకవర్గాలకు సీనియర్ నేతలు, ఎమ్మెల్యేలను సమన్వయకర్తలుగా నియమిస్తున్నట్లు బాబు వెల్లడించారు.

చిత్రాలు.. రామసుబ్బారెడ్డి *ఎన్‌ఎండి ఫరూఖ్