ఆంధ్రప్రదేశ్‌

లైట్ మెట్రో రైలు ప్రాజెక్టుపై సత్వర నివేదిక

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 18: అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు కింద విజయవాడ నగరంలో లైట్ మెట్రో రైలు ఎల్‌ఆర్‌టి (లైట్ రైల్ టెక్నాలజీ) ఏర్పాటు చేసేందుకు త్వరితగతిన సవివర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను సిద్ధం చేసి సమర్పించాలని ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్ కుమార్ జర్మనీకి చెందిన కెఎఫ్‌డబ్ల్యు సంస్థను కోరారు. మంగళవారం వెలగపూడి సచివాలయంలో ఆయన అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుపై ఆ సంస్థ ప్రతినిధులతో చర్చించారు. అమరావతి రాజధాని నగరంలో ప్రజా రవాణాకు లైట్ మెట్రో రైలు అన్ని విధాల ఉపయోగకరంగా ఉంటుందని నిపుణులు సహితం భావిస్తున్న నేపథ్యంలో అందుకు సంబంధించి సవివర ప్రాజెక్టు నివేదిక (డిపిఆర్)ను సిద్ధం చేసి ఇవ్వాలని చెప్పారు. అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టుకు జర్మనీకి చెందిన కెఎఫ్ డబ్ల్యు సంస్థ 300 మిలియన్ డాలర్ల నిధులు అందించేందుకు ముందుకు వచ్చిన నేపథ్యంలో ఈ ప్రాజెక్టు నిర్మాణానికి సంబంధించిన డిపిఆర్‌ను ఇవ్వాలని కోరారు.
నూతనంగా ఏర్పాటు చేస్తున్న రాజధానిలో ప్రజలకు మెరుగైన, తక్కువ ఖర్చుతో కూడిన ఉత్తమ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తేవాలని ప్రభుత్వం భావిస్తోందని సిఎస్ దినేష్‌కుమార్ పేర్కొన్నారు. రాజధాని ప్రాంతంలో ప్రజలకు అవసరమైన, మెరుగైన వౌలిక సదుపాయాలను కల్పించాల్సి ఉందని, ఈ మేరకు ప్రభుత్వం శరవేగంగా చర్యలు తీసుకుంటోందని అన్నారు. ప్రజా రవాణాకు సంబంధించి బిఆర్టీఎస్, ఎల్‌ఆర్‌టి లేదా మెట్రో వంటి ఉత్తమ రవాణా వ్యవస్థను అందుబాటులోకి తెచ్చెందుకు ప్రయత్నం జరుగుతోందని అన్నారు. అన్ని అంశాలను దృష్టిలో ఉంచుకుని లైట్ మెట్రో రైలు వ్యవస్థ ఏర్పాటుకు త్వరితగతిన డిపిఆర్‌ను అందించాలని సిఎస్ ఆ సంస్థ ప్రతినిధులను కోరారు. ఈ సమావేశంలో అమరావతి మెట్రో రైలు ప్రాజెక్టు ఎండి ఎస్‌పి రామకృష్ణారెడ్డి, జర్మనీకి చెందిన కెఎఫ్ డబ్ల్యు సంస్థ ప్రతినిధులు జులియా, రాబర్ట్, పాస్కల్‌తో పాటు ఉషారావు, అహూజా, విజెఎం రావు తదితరులు పాల్గొన్నారు.