ఆంధ్రప్రదేశ్‌

ఆంధ్రా రవాణా, కార్మికశాఖలపై హైకోర్టు ఆగ్రహం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

హైదరాబాద్, జూలై 18: మోటారు వాహనాల చట్టాన్ని సక్రమంగా అమలు చేయకపోవడం పట్ల ఆంధ్రప్రదేశ్ రవాణా, కార్మిక శాఖ అధికారుల తీరుపై హైకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. దివాకర్ ట్రావెల్స్‌కు ఏ ప్రాతిపదికన క్లీన్ చిట్ ఇచ్చారని హైకోర్టు ప్రశ్నించింది. మోటారు వాహనాల చట్టాన్ని సక్రమంగా అమ లు చేసేటట్లు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతూ కెవి సుబ్బారెడ్డి దాఖ లు చేసిన పిటిషన్‌ను హైకోర్టు ధర్మాసనం విచారిస్తూ పై విధంగా స్పందించింది. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం తరఫున న్యాయవాది వాదనలు వినిపిస్తూ ఇంతవరకు రవాణా శాఖ 1554 నోటీసులను ప్రైవేట్ బస్సు ఆపరేటర్లకు జారీ చేసిందన్నారు. మోటారు వాహనాల చట్టాన్ని అమలు చేయకపోతే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించామన్నారు. చట్టాన్నిఅమలు చేయని ప్రైవేట్ ఆపరేటర్లకు పర్మిట్లను ఎందుకు రద్దు చేయలేదని హైకోర్టు ప్రశ్నించింది. ఈ కేసులో పిటిషనర్ తరఫున న్యాయవాది పిఏ పద్మనాభం వాదించారు. కేసు విచారణను సెప్టెంబర్ 11కివాయిదా వేశారు.