ఆంధ్రప్రదేశ్‌

విదేశీ విధానంపై చర్చిద్దాం రండి

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (కార్పొరేషన్), జూలై 18: విదేశీ విధానాన్ని రాజకీయ కోణంలో వాడుకుంటున్న బిజెపి చర్యలను కాంగ్రెస్ ఖండిస్తోందని, ఆందోళన కలిగిస్తున్న దేశ భద్రతపైనా, విదేశీ విధానాలపైనా చర్చించేందుకు తాము సిద్ధంగా ఉన్నామని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు డాక్టర్ ఎన్ రఘువీరారెడ్డి పేర్కొన్నారు. మంగళవారం ఉదయం నగరంలోని ఎపిసిసి కార్యాలయంలో ఎన్‌డిఎ ప్రభుత్వ విదేశీ విధానం - జాతీయ భద్రత అనే అంశంపై వివిధ రాజకీయ పక్షాలతో నిర్వహించిన పొలిటికల్ రౌండ్ టేబుల్ సమావేశంలో రఘువీరారెడ్డి మాట్లాడుతూ గత 70 ఏళ్లలో ఎన్నడూ లేని విధంగా ప్రస్తుత బిజెపి నేతృత్వంలోని ఎన్‌డిఎ ప్రభుత్వం అనుసరిస్తున్న విదేశీ విధానం అప్రజాస్వామికంగా ఉందన్నారు. కొన్ని స్వార్థపర శక్తుల పాలనలో దేశం బలహీన పడిన సమయంలో అందరూ కలిసి ఒక్కటవ్వాల్సిన అవసరం ఉందని విపక్షాలకు పిలుపునిచ్చారు. దేశ సరిహద్దుల్లో వందలాది మంది దేశ సైనికులు ప్రాణాలను కోల్పోతున్న వైనం విచారకరం కాగా చనిపోయిన సైనికుల కుటుంబాలను ఆదుకోవడంలో కూడా ప్రభుత్వం ఘోరంగా విఫలమవుతున్న తీరు హేయమన్నారు. వారిని ఆదుకునేందుకు దేశం యావత్తూ అండగా నిలవాలన్నారు. విదేశీ విధానాలను ప్రభుత్వం అవగాహన లేక చేస్తోందా.. ఉద్దేశ్యపూర్వకంగా చేస్తోందా.. అనేది అర్థం కావటం లేదన్నారు. చుక్కాని లేని నావలా వెళ్తున్న ఎన్‌డిఎ విదేశీ విధానాలపై అందరూ కలిసి బహిరంగంగా మాట్లాడుకోవాల్సిన అవసరం వచ్చిందన్నారు. మాజీ రక్షణ శాఖామంత్రి పల్లంరాజు మాట్లాడుతూ గత యుపిఎ పాలనలో అనుసరించిన విదేశీ విధానాలకు తిలోదకాలిచ్చిన ప్రస్తుత ఎన్‌డిఎ ప్రభుత్వ విధానాలు దేశ ప్రజలకు, ప్రయోజనాలకే కాకుండా భవిష్యత్తుకు కూడా అత్యంత ప్రమాదకరంగా మారాయని ఆందోళన వ్యక్తం చేశారు. ఈవిషయంపై సమగ్రంగా చర్చించిన తరువాత స్థానిక నేతల అభిప్రాయాలను జాతీయ స్థాయికి తీసుకెళ్ళేందుకు కాంగ్రెస్ కృషి చేస్తోందన్నారు. దేశ సమగ్రతకు, సార్వభౌమత్వానికి హాని కలిగించే చర్యలను ప్రారంభంలోనే అడ్డుకోవాల్సిన అవసరం ఉందని, ఇందుకు అన్ని రాజకీయ పక్షాలు సమాయత్తం కావాలని కోరారు. మాజీ ఎమ్మెల్యే కె సుబ్బరాజు, సిపిఎం రాష్ట్ర కార్యదర్శి వర్గ సభ్యుడు సిహెచ్ బాబూరావులతోపాటు పలువురు సీనియర్ జర్నలిస్టులు, వైద్యులు, మహిళా సంఘాల నేతలు పాల్గొని తమ అభిప్రాయాలను వివరించారు.

చిత్రం..