ఆంధ్రప్రదేశ్‌

ఉండవల్లి, గోరంట్లకు నో ఎంట్రీ

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ (క్రైం), జూలై 18: పట్టిసీమ ప్రాజెక్టుపై ఇద్దరు సీనియర్ రాజకీయ నేతలు మంగళవారం విజయవాడ ప్రకాశం బ్యారేజ్‌పై తలపెట్టిన బహిరంగ చర్చను పోలీసులు అడ్డుకున్నారు. పట్టిసీమ ప్రాజెక్టులో అవినీతి జరిగిందంటూ రాజమండ్రి మాజీ ఎంపి ఉండవల్లి అరుణ్‌కుమార్ ఆరోపించగా.. కొట్టిపారేసిన టిడిపి రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్యచౌదరి బహిరంగ చర్చకు సవాల్ విసిరారు. దీంతో పట్టిసీమ అంశంపై ప్రకాశం బ్యారేజీ వద్ద బహిరంగ చర్చకు రావాలని ఒకరికొకరు సవాల్ చేసుకున్న నేపథ్యంలో ఇద్దరూ మంగళవారం విజయవాడ చేరుకున్నారు. అయితే చర్చ జరకుండానే పోలీసులు రంగంలోకి దిగి అడ్డుకున్నారు. ప్రకాశం బ్యారేజీ పరిసర ప్రాంతాల్లో శాంతి భద్రతల దృష్ట్యా అనుమతి లేదని చెబుతున్న పోలీసులు వీరిద్దరూ ఎదురుపడకుండా జాగ్రత్త పడ్డారు. పోలవరం, పట్టిసీమ ప్రాజెక్టులపై బహిరంగ చర్చకు రావాలని బుచ్చయ్య చౌదరి విసిరిన సవాల్‌కు స్పందించిన ఉండవల్లి ఒకరోజు ముందుగానే విజయవాడ చేరుకున్నారు. మంగళవారం ఉదయం 11 గంటలకు ప్రకాశం బ్యారేజీ వేదికగా నిర్ణయించుకున్న క్రమంలో ఉండవల్లి ఆరుణ్‌కుమార్ బ్యారేజీ వద్దకు చేరుకునే ప్రయత్నంలో రంగంలోకి దిగిన పోలీసులు ఆయన్ను అడ్డుకుని తమ అదుపులోకి తీసుకున్నారు. బ్యారేజీ వద్ద సెక్షన్ 30 ఆంక్షలు అమల్లో ఉన్నాయని పేర్కొంటూ ఆయన్ను అరెస్టు చేసి ఉయ్యూరు పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఉండవల్లి అనుకున్న సమయానికి కన్నా అరగంట ముందే చేరుకున్నారు. కాని అప్పటికీ నగరానికి రాని బుచ్చయ్య చౌదరి రాజమండ్రి నుంచి భారీగా అనుచరగణంతో విజయవాడకు చేరుకోగా.. గన్నవరం విమానాశ్రయం సమీపంలోనే పోలీసులు అయన్ను నిలువరించారు. పోలీసులు వీరిద్దరిని అడ్డుకోగా చర్చకు బ్రేక్ పడింది.
ఆధారాలతో నిరూపిస్తా : ఉండవల్లి
పట్టిసీమలో అవినీతి జరిగిందని, అవకాశం ఇస్తే తాను అధారాలతో నిరూపిస్తానని ఉండవల్లి అరుణ్‌కుమార్ అన్నారు. పోలీసులు అడ్డుకున్న సమయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమపై గత రెండేళ్ళుగా తాను లేవనెత్తిన ప్రశ్నలకు ప్రభుత్వం సమాధానం చెప్పలేదని, బుచ్చయ్య చౌదరి ముందుకు రావడంతో తాను విజయవాడ వచ్చానన్నారు. కాని పోలీసులు అడ్డుకోవడం సరైంది కాదని అన్నారు.
ఆయన అంతే.. విషం కక్కుతారు : గోరంట్ల
విజయవాడకు బయలుదేరిన ఎమ్మెల్యే గోరంట్లను పోలీసులు అడ్డుకున్న సమయంలో వాగ్వివాదం చోటు చేసుకుంది. బహిరంగ చర్చకు వెనక్కు తగ్గేది లేదని స్పష్టం చేశారు. ఈ సందర్భంగా ఆయన మీడియాతో మాట్లాడుతూ పట్టిసీమ, పోలవరం ప్రాజెక్టులపై ఉండవల్లి విషం కక్కుతున్నారన్నారు. అవాస్తవాలు చెబుతూ ప్రజల్లో అపోహలు సృష్టిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అందుకే బహిరంగ చర్చకు సవాల్ విసిరానని అన్నారు. జలయజ్ఞం పేరుతో దోచుకుపోయిన నాయకుడి ప్రథమ శిష్యుడు ఉండవల్లి అరుణ్‌కుమార్ అని ఆరోపించారు.