ఆంధ్రప్రదేశ్‌

గ్రాసం కరువై... విగత జీవులై...

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

కాకినాడ, జూలై 18: ఓవైపు ఎడతెరిపి లేని వర్షాలు, చలిగాలులు... మరోవైపు ఆలనాపాలనా పట్టించుకోకుండా గాలికి వదిలేయడంతో తిండి కరువై గోవులు మృత్యువాత పడిన వైనమిది. సుమారు 10 రోజులుగా పశుగ్రాసం లేక ఆకలితో అలమటిస్తూ 20 గోవులు మృతిచెందిన హృదయ విదారక సంఘటన తూర్పుగోదావరి జిల్లా కేంద్రం కాకినాడ నగరంలో చోటుచేసుకుంది. గోసంరక్షణ అంటూ పదే పదే వల్లెవేసే గోసంరక్షణ కేంద్రం నిర్వాహకులు, అధికారుల శల్య సారథ్యానికి ఈ పరిణామం పరాకాష్ఠగా చెప్పవచ్చు. కాకినాడ నగరంలోని నాగమల్లితోట సమీపంలో జంతు హింస నివారణ సంఘం (ఎస్‌పిసిఎ) ఉంది. ఈ కేంద్రాన్ని సదరు నిర్వాహకులు ప్రభుత్వ యంత్రాంగం ఆదేశాల మేరకు నిర్వహిస్తున్నారు. సుమారు 100 గోవులు ఈ కేంద్రం సంరక్షణలో ఉన్నాయి. అయితే దాదాపు 10 రోజులుగా పశుగ్రాసం లేక గోవులు విలవిల్లాడుతున్నాయి. భారీ వర్షాల కారణంగా ఆహార సమస్య మరింత జటిలమయ్యింది. దీంతో మంగళవారం 20 గోవులు మృతి చెందాయి. గోసంరక్షణ కేంద్రంలో మూగజీవాలు విగత జీవులై కనిపించాయి. అయితే ఇంత జరిగినా అధికార గణం పట్టించుకోకపోవడం గమనార్హం. సంబంధిత శాఖల అధికారులు నిర్లక్ష్యం వహించడం పట్ల జంతు ప్రేమికులు తీవ్ర ఆగ్రహం వ్యక్తంచేస్తున్నారు. తక్షణం ఇందుకు బాధ్యులపై తగు చర్యలు తీసుకోవడంతో పాటు గోవుల పరిరక్షణకు చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నారు.