ఆంధ్రప్రదేశ్‌

పూరి-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనున్న వాయుగుండం

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విశాఖపట్నం, జూలై 18: బంగాళాఖాతంలో ఏర్పడిన వాయుగుండం మంగళవారం అర్థరాత్రికి ఒడిశాలోని పూరి-గోపాల్‌పూర్ మధ్య తీరం దాటనుంది. దీని ప్రభావం వలన ఉత్తర కోస్తాలో ఒక మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని, తీరం వెంబడి 50 నుంచి 55 కిలో మీటర్ల వేగంతో గాలులు వీస్తాయని విశాఖ తుపాను హెచ్చరికల కేంద్రం మంగళవారం రాత్రి తెలియచేసింది. శ్రీకాకుళం నుంచి కృష్ణా జిల్లా వరకూ మంగళవారం ఉదయం నుంచి సాయంత్రం వరకూ అనేక ప్రాంతాల్లో భారీ వర్షాలు కురిసాయి. జి కొండూరు మండలం వెలగలేరులో ఏడు సెంటీ మీటర్లు, విజయనగరం జిల్లా కురుపాం మండలం రచ్చకుంట, తూర్పు గోదావరి జిల్లా వెల్లలో ఆరు సెంటీ మీటర్ల చొప్పున వర్షపాతం నమోదైంది. విజయనగరం జిల్లా వెలిడ, కృష్ణా జిల్లా కంచికచర్ల, నిడమర్రు, ఇబ్రహీపట్నం, తూర్పు గోదావరి జిల్లా తొండంగిల్లో ఐదు సెంటీ మీటర్ల చొప్పున వర్షం కురిసింది.