ఆంధ్రప్రదేశ్‌

అసంఘటిత కార్మికులకు ధీమా చంద్రన్న బీమా

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

అమరావతి, జూలై 20: పేద, బడుగు, బలహీన వర్గాల సంక్షేమమే లక్ష్యంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం ప్రతిష్ఠాత్మకంగా ప్రవేశపెట్టిన చంద్రన్న బీమా పథకం సత్ఫలితాలనిస్తోంది. అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు అకస్మాత్తుగా మరణిస్తే ఆ కుటుంబం దిక్కులేనిదిగా మారిపోతుంది. ప్రతిపక్ష నేతగా రాష్ట్ర వ్యాప్తంగా మీ కోసం పాదయాత్ర చేసిన సందర్భంలో ప్రతి ఇంటికీ పెద్ద కొడుకునవుతానంటూ నారా చంద్రబాబునాయుడు నాడు ప్రజలకు హామీ ఇచ్చారు. అందులో భాగంగానే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక చంద్రన్న బీమా పథకాన్ని ప్రారంభించారు. ఈ పథకం ద్వారా అసంఘటిత రంగంలో పనిచేసే కార్మికులు ప్రమాదవశాత్తూ చనిపోతే ఆయా కుటుంబాలకు రూ.5 లక్షలు పరిహారం చెల్లించే బృహత్తర కార్యక్రమానికి రూపకల్పన చేసింది. దీనికోసం ఇన్స్యూరెన్స్ కంపెనీలకు చెల్లించాల్సిన ప్రీమియం మొత్తాన్ని కూడా ప్రభుత్వమే భరిస్తోంది. కేవలం డాక్యుమెంటేషన్ చార్జీల కోసం నామమాత్రంగా కార్మికుల నుంచి రూ.15 రుసుము వసూలు చేస్తోంది. ఈ పథకంలో భాగంగా రెండు ఇన్స్యూరెన్స్ కంపెనీలతో ప్రభుత్వం అవగాహన కుదుర్చుకుంది. లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ (ఎల్‌ఐసి)తో పాటు, ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ (ఓఐసి) సంస్థలతో ఈ మేరకు ప్రభుత్వ ఒప్పందం కుదుర్చుకుంది. చంద్రన్న బీమా పథకానికి సంబంధించిన క్లెయిమ్‌లను సంబంధిత లబ్ధిదారులకు అందజేయడంలో సెర్ప్ కీలకపాత్ర పోషిస్తోంది. ఈ మొత్తం వ్యవహారాలను కార్మికశాఖ స్వయంగా సమన్వయపరుస్తోంది. ఈ పథకంలో ఇప్పటివరకు దాదాపు 2.13 కోట్ల మంది కార్మికులు నమోదు చేసుకున్నారు. చంద్రన్న బీమా పథకంలో ఎల్‌ఐసికి సంబంధించి ఇప్పటివరకు 55,345 మంది క్లెయిమ్ కోసం దరఖాస్తు చేసుకోగా, వారిలో పూర్తి డాక్యుమెంట్లు సమర్పించినవారు 53,627 మంది. వీరిలో అర్హులైన వారి కుటుంబాలకు అంత్యక్రియల కోసం ప్రభుత్వం రూ.5వేలు మంజూరు చేసింది. దరఖాస్తులను పరిశీలించిన ఎల్‌ఐసి 47,454 క్లెయిమ్‌లకు సంబంధించిన పరిహారం మొత్తాన్ని సెర్ప్‌కు అందజేసింది. పరిహారం చెల్లింపుకు సంబంధించి సెర్ప్ అధికారులు 42,984 మంది బ్యాంక్ ఖాతాలకు క్లెయిమ్ సొమ్ము బదిలీ చేశారు. ఎల్‌ఐసి కింద చేస్తున్న చెల్లింపులకు సంబంధించి ప్రమాదవశాత్తూ చనిపోయినవారికి రూ.75వేల పరిహారాన్ని, సాధారణ మృతులకు రూ.30వేల పరిహారాన్ని అందజేస్తున్నారు. ఇక ఓరియంటల్ ఇన్స్యూరెన్స్ కంపెనీ 7,310 క్లెయిమ్‌లను రిజిస్టర్ చేసింది. 6,397 మందికి సంబంధించిన పూర్తి డాక్యుమెంట్లను సమర్పించింది. వీరిలో 3,488 మందికి సంబంధించి పరిహారం మొత్తాన్ని ఇన్స్యూరెన్స్ కంపెనీ అధికారులు సెర్ప్‌కు అందించారు. వీరిలో ఇప్పటికే 2,885 మంది నామినీ బ్యాంక్ ఖాతాలకు క్లెయిమ్ సొమ్మును బదిలీ చేశారు. కార్మికులు ఆకస్మికంగా మృతి చెందితే ఆ కుటుంబాలు రోడ్డున పడకూడదన్న ఉద్దేశంతో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించారు. ఆ కుటుంబాలకు పరిహారం కింద వచ్చే మొత్తం భరోసాగా ఉండటంతోపాటు వారి కుటుంబంలోని పిల్లలు చదువుకోవడం కోసం స్కాలర్‌షిప్‌లను అందుకునే విధంగా ఈ పథకాన్ని తీర్చిదిద్దామని సెర్ప్ సిఇవో పొట్లూరి కృష్ణమోహన్ వివరించారు.