ఆంధ్రప్రదేశ్‌

‘పురుషోత్తపట్నం’ పనులకు వరుణుడి బ్రేక్!

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

రాజమహేంద్రవరం, జూలై 20: భారీ వర్షాలు తూర్పు గోదావరి జిల్లాలోని పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులకు ప్రతిబంధకంగా మారాయి. పైపులైన్, పంపుహౌస్ నిర్మాణ పనులకు విఘాతం ఏర్పడింది. పంపుహౌస్ పనులు జరుగుతున్న గట్టు వరకు గోదావరి వరద నీటి ప్రవాహం తాకుతోంది. ముఖ్యమంత్రి గత సోమవారం ప్రాజెక్టు పనులను పరిశీలించి, సమీక్షించేందుకు ఏర్పాట్లుచేశారు. కానీ వర్షాల కారణంగా ముఖ్యమంత్రి పర్యటన కూడా చివరి నిముషంలో రద్దయింది. ఈ నెల నాల్గవ సోమవారం వాతావరణం అనుకూలిస్తే ముఖ్యమంత్రి పర్యటనకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఆగస్టు 15 నాటికి పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం పనులు పూర్తిచేసి, రబీలో ఏలేరుకు నీరివ్వాలని లక్ష్యంగా నిర్దేశించారు. కానీ ఈ గడువులోగా ఒక పంపు నుంచి కూడా నీరు ఇచ్చే అవకాశం కన్పించడంలేదు. ఏలేరుకు నీరు చేరాలంటే పోలవరం ఎడమ ప్రధాన కాల్వలో మూడు ప్యాకేజీల పనులు పూర్తి కావాల్సి వుంది. ఇందులో రెండో ప్యాకేజీ పనులు ఏనాడో పూర్తయ్యాయి. మూడో ప్యాకేజీలో కొన్ని మిగిలినపోయిన పనులు పూర్తిచేయాల్సి వుంది. అవి పూర్తి కానున్నాయి. ఇక ప్రధానంగా మొదటి ప్యాకేజీలో పనులు పూర్తికాకపోవడం వల్ల పురుషోత్తపట్నం లక్ష్యానికి విఘాతం కలుగుతోందని తెలుస్తోంది. ఒక వేళ నీరు అనుకున్నట్టుగా విడుదల చేశామని చెప్పుకునేందుకు ఒక పంపు విడుదల చేస్తే మాత్రం ఆ నీళ్లు గోకవరం వరకు వచ్చి ఆగిపోతాయని తెలుస్తోంది.
ఇదిలా వుండగా పురుషోత్తపట్నం హెడ్ వర్క్సు పనులు శరవేగంగానే జరుగుతున్నాయి. పైపులైన్ పనులు, పంపుహౌస్ పనుల్లో రోజు రోజుకీ పురోగతి కన్పిస్తోంది. కానీ ప్రతికూల వాతావరణం వల్ల మాత్రం కాస్తంత పనులు ఆలస్యమవుతున్నాయి. ఒక పంపునైనా పని చేయించే రీతిలో పనులు జరుగుతున్నాయని చెప్పొచ్చు. పురుషోత్తపట్నం ఎత్తిపోతల పథకం నుంచి గోదావరి నదికి వరదల సమయంలో 14 మీటర్ల మట్టం నమోదైన దశలోనే నీరు తోడాల్సివుంది. పంపుల ద్వారా 3500 క్యూసెక్కుల నీటిని తోడి, 1.600 కిలోమీటర్ల వద్ద పోలవరం ఎడమ కాలువకు చేర్చుతారు. మొత్తం 10 పంపులను ఏర్పాటుచేస్తారు. ఒక్కో పంపు 10 క్యూమెక్స్ నీటిని తోడుతుంది. ఐదు వరుసల్లో 10.10 కిలోమీటర్ల పొడవునా ప్రెజర్‌మెయిన్ నిర్మిస్తున్నారు. ఈ పైపులైన్ల కోసం తీసిన గోతుల్లో భారీ వర్షాలవల్ల నీరు చేరి ఆటంకం కలుగుతోంది. అవసరమైన విద్యుత్ సరఫరా కోసం పుంపుహౌస్‌కు సమాంతరంగా గట్టువద్ద 57 మెగా వాట్ల సామర్ధ్యం కలిగిన సబ్-స్టేషన్‌ను నిర్మిస్తున్నారు. రెండో దశలో 1400 క్యూసెక్కుల నీటిని పోలవరం ఎడమ కాలువ 50 కిలోమీటర్ల నుంచి రెండు లేన్ల పైపులైన్ల ద్వారా పంపుహౌస్‌లో తోడి 60 మీటర్ల దూరంలోని ఏలేరు రిజర్వాయర్ హెడ్‌లోవేస్తారు. ఇక్కడ పంపుహౌస్‌కు 35.36 మెగావాట్ల విద్యుత్ అవసరంవుంది. ఈ ఎత్తిపోతల పథకం నుండి పోలవరం ఎడమ కాలువ ద్వారా 2.15 లక్షల ఎకరాలకు సాగునీరు అందిస్తారు. విశాఖ పారిశ్రామిక అవసరాలకు, తాగునీటి అవసరాలకు కూడా ఇదే అధారంగా వుంది. ఈ కాల్వ ద్వారా ఏడాదికి రూ.200 కోట్ల విలువైన పంట లభిస్తుందని అంచనావేశారు.