ఆంధ్రప్రదేశ్‌

ఆక్వా ఫుడ్‌పార్కుకు భారీయంత్రాలు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

భీమవరం, జూలై 20: పశ్చిమ గోదావరి జిల్లాలోని తుందుర్రులో అంతర్జాతీయ ప్రమాణాలతో నిర్మితమవుతున్న గోదావరి మెగా ఆక్వా ఫుడ్ పార్కు నిర్మాణ దశ నుంచి యంత్ర పరికరాలు బిగించే స్థాయికి చేరుకుంది. గత కొద్ది రోజులుగా వివధ ప్రాంతాల నుంచి భారీ కంటైనర్లతో వీటిని తీసుకువస్తున్నారు. వాటిని అడ్డుకోవడానికి గురువారం నాడు ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాట కమిటీ, ఐద్వా కార్యకర్తలు ప్రయత్నించడంతో ఈ ప్రాంతంలో తీవ్ర ఉద్రిక్తత తలెత్తింది. తుందుర్రు ఫుడ్ పార్కుకు భారీ కంటైనర్లతో యంత్ర పరికరాలు వస్తున్న నేపథ్యంలో ముందుగానే సుమారు 800 పోలీసులు, ప్రత్యేక బృందాలు ఆ ప్రాంతానికి చేరుకున్నాయి. ఫుడ్‌పార్కు వ్యతిరేక పోరాట కమిటీ నాయకులు ఆరేటి వాసు, ఆరేటి సత్యవతి తదితరులను పోలీసులు ముందుగానే అదుపులోకి తీసుకున్నారు. భారీ వాహనాలు పరికరాలుతో ఫుడ్‌పార్కు వద్దకు చేరుతుండగా ఫుడ్‌పార్కు వ్యతిరేక కమిటీ, ఐద్వా సభ్యలు అడ్టుకునే ప్రయత్నం చేశారు. వారిని పోలీసులు వారించారు. దీంతో ఆందోళనకారులు పోలీసులపై కారం, కిరోసిన్ చల్లడం ప్రారంభించారు. వెంటనే పోలీసులు పరిస్థితిని అదుపులోకి తీసుకురావడానికి ఆందోళనకారులను వ్యాన్లలోకి ఎక్కించి నరసాపురం పోలీసు స్టేషన్‌కు తరలించారు. ఇతర ప్రాంతాల నుంచి భారీ కంటైనర్లలో వచ్చిన యంత్ర సామాగ్రిని ఫుడ్‌పార్కులోకి తరలించారు.

చిత్రం.. ఆందోళనకారులు, పోలీసుల మధ్య తోపులాట