ఆంధ్రప్రదేశ్‌

సామాన్యుడికి భారం కావొద్దు

S ,7 à 8 RSCA (si SASPAS) et 6 cialis pharmacie cialis rapports de stage.

విజయవాడ, జూలై 20: సామాన్య ప్రేక్షకుడికి భారం కాని రీతిలో సినిమా టిక్కెట్ల ధరల పెంపు ఉండాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సూచించారు. దేశ వ్యాప్తంగా ఏకీకృత వస్తు సేవల పన్ను (జీఎస్టీ) అమల్లోకి వచ్చిన నేపథ్యంలో రాష్ట్రంలోని వివిధ సినిమా ధియేటర్లలో టిక్కెట్ ధరల పెంపు అంశంపై ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి దినేష్‌కుమార్ సంబంధిత శాఖల అధికారులతో కూడిన కమిటీతో గురువారం సమీక్షించారు. గ్రామీణ, పట్టణ ప్రాంతాల్లోని ఏసి థియేటర్లు, ఏసి లేని థియేటర్లు, మల్టీప్లెక్స్ థియేటర్లు, సింగిల్ స్క్రీన్ థియేటర్లలో ప్రస్తుతం ఉన్న ధరలను జీఎస్టీ అమల్లోకి వచ్చిన తర్వాత అందుకు అనుగుణంగా కేటగిరీని బట్టి పెంచే అంశాలపై చర్చించారు. సామాన్య, మధ్యతరగతి ప్రజల ప్రయోజనాలను దృష్టిలో ఉంచుకుని వారికి భారం కాని రీతిలో ఈ ధరలు ఉండే విధంగా చర్యలు తీసుకోవాల్సి ఉందని, ఆ ప్రకారం ప్రతిపాదిత ధరల పెంపుపై చర్చించి తుది నివేదిక సిద్ధం చేసి ప్రకటించాలని హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనూరాధకు ప్రధాన కార్యదర్శి సూచించారు. ఇటీవల కాలంలో సినిమా థియేటర్లు, మల్టీప్లెక్స్‌ల్లో వివిధ పానీయాలు, ఇతర తినుబండారాలు అధిక ధరలకు విక్రయిస్తున్నారని వస్తున్న ఫిర్యాదులు, మీడియాలో వస్తున్న కథనాలపై థియేటర్ల లైసెన్సింగ్ అథారిటీగా ఉన్న జాయింట్ కలెక్టర్లు, పోలీస్, తదితర శాఖల అధికారులు సకాలంలో స్పందించి చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. అంతేగాక సినిమా థియేటర్లలో తగిన భద్రతాపరమైన చర్యలు చేపట్టడంతోపాటు కనీస పారిశుద్ధ్య సౌకర్యాలు అందుబాటులో ఉండేలా ఎప్పటికప్పుడు పర్యవేక్షించాలని స్పష్టం చేశారు. దేశ సర్వోన్నత న్యాయస్థానం ఆదేశాల మేరకు జాతీయ గీతాన్ని అన్ని థియేటర్లలోను సినిమా ప్రారంభానికి ముందు తప్పక ప్రదర్శించే విధంగా చూడాలని సిఎస్ ఆదేశించారు. ఈ సమావేశంలో రెవెన్యూ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి డి.సాంబశివరావు, ఐటి శాఖ ముఖ్య కార్యదర్శి విజయానంద్, హోంశాఖ ముఖ్య కార్యదర్శి ఎఆర్ అనూరాధ, సమాచారశాఖ కమిషనర్, రాష్ట్ర చలనచిత్ర అభివృద్ధి సంస్థ ఎండి ఎస్.వెంకటేశ్వర్, సమాచారశాఖ అదనపు సంచాలకులు మల్లాది కృష్ణానంద్, ఇంకా ఆర్థిక, మున్సిపల్, తదితర శాఖల అధికారులు పాల్గొన్నారు.